Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభRajamouli-Mahesh: మహేష్ కోసం బచ్చన్, సంజయ్ దత్?

Rajamouli-Mahesh: మహేష్ కోసం బచ్చన్, సంజయ్ దత్?

Rajamouli-Mahesh: దర్శక ధీరుడు జక్కన్న తర్వాత సినిమాపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా కావడం, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కావడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ కూడా సిద్ధం చేస్తున్నాడు.

- Advertisement -

అయితే, ఈ సినిమా ఏ జానర్ లో ఉండనుంది..? కథ ఏంటి? హీరోయిన్ ఎవరు? మహేష్ ను ఎలా చూపించనున్నారని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా.. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఓ ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాగా తెలుస్తుంది. కాగా.. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి కూడా స్టార్ క్యాస్టింగ్ ను తీసుకోబోతున్నారట.

అందులో భాగంగానే ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా అమితాబ్ బచ్చన్ నటించబోతునట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతుందనే టాక్ కూడా నడుస్తోంది. ఆ మధ్య ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. మరి ఇందులో నిజమెంతో కానీ.. ఇంకా నటీనటుల ఎంపిక జరగనేలేదు కానీ.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు వీళ్ళే ఈ సినిమాలో నటించేదని కథానాలైతే వస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News