ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు అనగనగా మూవీ టీజర్ విడుదల( anaganagaTeaser) కానుంది. ఈ టీజర్ ను ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేయనున్నారు.
టాలీవుడ్‌లో మంచి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే సుమంత్, ఇప్పుడు మరో ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందు అలరించబోతున్నారు. ‘అనగనగా’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్‌తో పాటు కాజల్ చౌదరి, శ్రీనివాస్ అవసరాల, విహర్ష్ యాదవల్లి ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ మూవీపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయని చిత్ర యూనిట్ తెలిపారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అందులో భాగంగానే అనగనగా టీజర్ ని ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో నేరుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. సన్నీ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫీల్ గుడ్ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.