Homeచిత్ర ప్రభEpic Teaser: బేబీ కాంబో రిపీట్.. ‘ఎపిక్‘ టీజర్ చూశారా?

Epic Teaser: బేబీ కాంబో రిపీట్.. ‘ఎపిక్‘ టీజర్ చూశారా?

Epic Teaser: బేబీ మూవీతో యూత్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి వీరిద్దరి వెండితెరపై సందడి చేయబోతోంది. ప్రస్తుతం వీరు జంటగా నటిస్తున్న చిత్రం ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకు 90s ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ డేస్, కెరీర్‌ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండనున్నట్లు టీజర్‌లో అర్థమవుతోంది. ఈ చిత్రంలో శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News