టాలీవుడ్ రచయిత అనంత శ్రీరామ్(Ananth Sriram) ‘కల్కి’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన దీక్ష దేవాలయ రక్ష’ పేరుతో విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం(Hindava Sankharavam) బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు. ముఖ్యంగా సినిమాల్లో హైందవ పురాణాలను వక్రీకరిస్తున్నారని తెలిపారు.
ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘కల్కి’ సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకోరని చెప్పారు. సినిమాల్లో పురాణాలపై ఇలాంటి వక్రీకరణలు చూసి తాను సిగ్గుపడుతున్నానని తెలిపారు. ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పాలని అనంత శ్రీరామ్ వెల్లడించారు.