Homeచిత్ర ప్రభAnanya Panday: అఖిల్ అక్కినేని లెనిన్‌లో లైగ‌ర్ బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌?

Ananya Panday: అఖిల్ అక్కినేని లెనిన్‌లో లైగ‌ర్ బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌?

Ananya Panday: అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు దాటిపోయింది. ఇప్ప‌టివ‌రకు ఆరు సినిమాలు చేశాడు. కానీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు. ఏజెంట్ డిజాస్ట‌ర్‌తో దాదాపు మూడేళ్లు సినిమాల‌కు గ్యాప్ తీసుకున్న అఖిల్ ప్ర‌స్తుతం లెనిన్‌లో న‌టిస్తున్నారు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ముర‌ళీకృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి నాగార్జున లెనిన్ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -

లెనిన్ మూవీ షూటింగ్ దాదాపు తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టేశారు మేక‌ర్స్‌. ఈ సినిమా నుంచి శుక్ర‌వారం హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సే ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భార‌తి అనే పాత్ర‌లో భాగ్య‌శ్రీ క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 5న ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల‌ చేయ‌నున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మాస్ పెప్పీ సాంగ్ కోసం ప‌లువురు హీరోయిన్ల‌ను అనుకున్న మేక‌ర్స్ చివ‌ర‌కు అన‌న్య పాండేను ఫైన‌ల్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సాంగ్‌లో న‌టించ‌డానికి అన‌న్య కూడా అంగీక‌రించిన‌ట్లు తెలిసింది. ఈ ఐటెంసాంగ్ కోసం భారీగానే రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

Also Read – Anupama Parameswaran: ప్రిన్సెస్ లుక్‌లో అనుపమ.. ఈ ఫోటోలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

తెలుగులో అన‌న్య పాండే చేస్తున్న సెకండ్ మూవీ ఇది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన లైగ‌ర్ మూవీలో అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీ డిజాస్ట‌ర్ కావ‌డంతో టాలీవుడ్‌లో మ‌రో అవ‌కాశం రాలేదు. మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ లెనిన్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

లెనిన్ మూవీ ఈ ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. శివాజీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

లెనిన్‌లో మొద‌ట హీరోయిన్‌గా శ్రీలీల‌ను తీసుకున్నారు. అఫీషియ‌ల్‌గా ఆమె పేరును అనౌన్స్‌ చేయ‌డ‌మే కాకుండా గ్లింప్స్ రిలీజ్ చేశారు. కానీ డేట్ ఇష్యూస్ వ‌ల్ల శ్రీలీల త‌ప్పుకోవ‌డంతో భాగ్య‌శ్రీ బోర్సేను క‌థానాయిక‌గా ఈ సినిమాలోకి అడుగుపెట్టింది. లెనిన్ స‌క్సెస్ అఖిల్‌తో పాటు భాగ్య‌శ్రీ ఇద్ద‌రికి కీల‌కంగా మారింది.

Also Read – Shah Rukh khan : షారుఖ్ జట్టులో బంగ్లా ఆటగాడు.. మహారాష్ట్రలో రేగిన రాజకీయ దుమారం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News