Anasuya Bharadwaj: తాను మోసినపోయానని నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ-కామర్స్‌లో తాను ఆర్డర్ చేసిన వాటిని కాకుండా మరో వస్తువులను పంపించిన మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆన్‌లైన్ కొనుగోలులో డబ్బు ముందే చెల్లించినా.. తాను ఆర్డర్ చేసిన బట్టలు (దుస్తులు) ఇప్పటి వరకు తనకు పంపలేదని ఆమె నెట్టింట మండిపడ్డారు. ఇదే విషయమై అనసూయ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
యాంకర్ అనసూయ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ప్రకారం.. దాదాపు నెల రోజులకు ముందు ట్రపుల్ ఇండియా అనే దుస్తుల వెబ్‌సైట్‌లో కొన్ని బట్టలను అనసూయ ఆర్డర్ పెట్టారు. అయితే ఆ దుస్తులకు సంబంధించిన డబ్బు మొత్తాన్ని ముందే చెల్లించారట. అయితే, ఈ పేమెంట్ జరిగి నెల రోజులు గడిచినా తాను ఆర్డర్ పెట్టిన మర్చండైజ్ ఇంకా రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై సదరు షాపింగ్ సైట్ నిర్వాహకులను సంప్రదించినా సరైన స్పందన రాలేదని ఆరోపణలు చేసింది. అటు ఆర్డర్ పెట్టిన దుస్తులు రాలేదని.. ఇటు తాను చెల్లించిన డబ్బు రీఫండ్ అవ్వలేదని.. దీంతో తాను మోసపోయానని అనసూయ ఆ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
సొంత బ్రాండ్ దుస్తులను విక్రయిస్తున్నామని చెప్పి వినియోగదారుల వద్ద డబ్బు దోచేస్తున్నారని ట్రపుల్ ఇండియా వెబ్ సైట్‌పై అనసూయ మండిపడింది. ఈ విషయంపై తాను మాట్లాడకూడదని అనుకున్నట్లు ఆమె వివరించారు. కానీ, తనలా ఇతరులు మోసపోతారేమోనని జాగ్రత్త కోసం ఈ పోస్ట్ అని స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యాంకర్ అనసూయ ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇవే కాకుండా పలు తెలుగు చిత్రాలు, తెలుగులో కొన్ని రియాల్టీ షోలలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతోంది. ఆమె చివరిగా తెలుగులో ‘పుష్ప 2’ చిత్రంతో వెండితెరపై కనిపించింది.


