Anasuya Bharadwaj: నటుడు శివాజీ స్టార్ట్ చేసిన ఈ వస్త్రధారణ కామెంట్లు నెల రోజులైనా కూడా వాటి వేడి తగ్గడం లేదు. శివాజీ చేసిన కామెంట్లపై అనసూయ, చిన్మయి వంటి వారు రియాక్ట్ అవ్వడం, మహిళా కమీషన్ వరకు విషయం వెళ్లడం, శివాజీ తన వాదనను వినిపించడం ఇలా అన్ని పరిణామాల్ని జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఇక సమాజంలో, సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా ఏర్పడి మరి ఈ విషయం మీద చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. శివాజీని సపోర్ట్ చేసే వారు కొంత మంది, అనసూయకు సపోర్ట్‌గా మరి కొంత మంది దిగి వాదోపవాదాలు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా నటుడు హర్ష వర్దన్ ఈ అంశం మీద స్పందించాడు. భావం సరిగ్గానే ఉన్నా, మాటలు, పదాలు తప్పుగా ఉంటే.. విషయం పక్క దారిన పడుతుందని ఆయన అన్నాడు. ఇక ఇంట్లో దొంగలు పడకుండా ఉండాలంటే.. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని, ఇంట్లో వాళ్లకు జాగ్రత్తలు చెప్పాలని, ఇంటికి తాళం వేయాలని.. అంతే గానీ.. నా ఇంట్లో దొంగతనానికి రాకండి అని దొంగకు చెప్పలేం కదా? అని ఆయన అన్నాడు. ఇక స్వేఛ్చలో చాలా అంశాలుంటాయని, అందులో బట్టలు ఒక భాగమే అని, బట్టలేసుకోవడమే స్వేచ్ఛ కాదని ఆయన తెలిపారు.
Also Read – Dhurandhar2: సినిమా చరిత్రలో అతిపెద్ద మల్టీస్టారర్.. ‘ధురంధర్ 2’పై రామ్ గోపాల్ వర్మ
ఇక ఈ వ్యాఖ్యలకి కౌంటర్ అన్నట్టుగా తాజాగా అనసూయ రియాక్ట్ అయింది. పార్లమెంటులో రేప్ చేసిన వారికి మరణశిక్ష అనే బిల్ అనేది ఎప్పటికీ పాస్ కాదట. ఎందుకంటే దాదాపు 40 మంది పార్లమెంట్ సభ్యులు ఇలాంటి రేప్ కేసులో ఉన్న వారేనట. ఇక ఇదే విషయాన్ని చిన్మయి ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కి అనసూయ రియాక్ట్ అయింది. ఇదే మన భారతదేశం, మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతదేశం.. చాలా దూరం కదా దారి.. మనం బట్టల దగ్గరే ఆగిపోయాం అంటూ సెటైరికల్‌గా స్పందించింది.
మరి ఇలా అనసూయ మన దేశం మీద, మన నేతల మీద చేసిన కామెంట్లకు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. శివాజీ మ్యాటర్ మాత్రం రోజుకో రకంగా రూపాంతరం చెందుతూనే ఉంది. ఎక్కడో ఎవరో ఒకరు ఏదో రకంగా కామెంట్ చేస్తూ ఈ అంశాన్ని ఇంకా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.
Idey mana Bharatadesam .. manam yenchukunna netalu nadipe Bharatadesam 🙏🏻🙏🏻🙏🏻 chaala dooram kada daari.. manam battala daggare aagipoyam.. https://t.co/ZC5YHyfpNC
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 18, 2026
Also Read – Korean Kanakaraju Title Glimpse: ‘కొరియన్ కనకరాజు’గా వరుణ్ తేజ్.. ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ గ్లింప్స్

