Anchor Ravi Sensational comments on Bigg Boss: తెలుగు టెలివిజన్ రంగంలో అతిపెద్ద రియాల్టి షోగా పేరొందింది బిగ్ బాస్ షో. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడూ వివాదాలకు కేంద్రబిందువుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా, ప్రముఖ యాంకర్ రవి.. ఓ ఇంటర్వ్యూలో ఈ షో గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిగ్ బాస్‌లో పాల్గొనడం వల్ల కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉందని, షోలో రియాల్టీ అనేది నామమాత్రమేనని రవి సంచలన ఆరోపణలు చేశాడు.
“బిగ్ బాస్‌లోకి వెళ్లడం గురించి మొదటి నుంచి నాకు ఆసక్తి లేదు. ఎందుకంటే ఆ షో ఎలా నడుస్తుందో నాకు తెలుసు. అక్కడ పాల్గొనేవారు మేనేజ్‌మెంట్ చెప్పినట్లు నటించాల్సిందే. ఎవరూ తమ నిజస్వరూపంతో ఉండరు. నాలుగు సీజన్లుగా వచ్చిన ఆఫర్లను తిరస్కరించాను. ఐదో సీజన్‌కు పెద్ద మొత్తం డబ్బు ఇస్తే వస్తానని చెప్పి తప్పించుకోవాలనుకున్నాను. కానీ వాళ్లు నేను అడిగిన డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది.”
“బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బుతో నేను ఇల్లు కట్టుకున్నాను. కానీ ఆ షోలోకి వెళ్తే మన పేరు, ప్రతిష్ట పోతాయి. కెరీర్ దెబ్బతింటుంది. మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాలి. అక్కడ ఒక డైరెక్టర్, పది మంది రైటర్స్ ఉంటారు. వాళ్లు ఏం చేయమంటే అది చేయాలి, లేకపోతే అగ్రిమెంట్ చూపించి బెదిరిస్తారు. ఎవరైనా బిగ్ బాస్‌లో నిజంగా ఉన్నామని చెబితే, వాళ్లను చెప్పుతో కొట్టాలి!” అని సంచలన వ్యాఖ్యాలు చేశాడు.
కాగా, బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొన్న రవి, మధ్యలోనే షో నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం అతడు వరుస టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో ఒక సినిమాలో హీరోగా కూడా నటించనున్నట్లు సమాచారం.


