Friday, February 21, 2025
Homeచిత్ర ప్రభAndaz Apna Apna 2: అమీర్ ఖాన్-సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్...

Andaz Apna Apna 2: అమీర్ ఖాన్-సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్

కామెడీ సీక్వెల్ తో ఖాన్స్

ఖాన్ త్రయంలో అమీర్ ఖాన్-సల్మాన్ ఖాన్ సినిమాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ మొదలు అన్ని వయసుల వారు వీరి సినిమాలను చూసేందుకు ఇష్టపడతారు. విదేశాల్లోనూ వీరి సినిమాలకు ఇంతే క్రేజ్, మార్కెట్ ఉంది. అయితే వీరిద్దరూ 1994లో కలిసి నటించిన సూపర్ హిట్ కామెడీ సినిమా అందాజ్ అప్నా అప్నా. ఇప్పుడి మళ్లీ వీరిద్దరి కాంబోలో అందాజ్ అప్నా అప్నా సీక్వెల్ నిర్మాణంలో ఉందనే విషయం సడన్ గా లీక్ అయింది. అంతేకాదు ఇది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యేందుకు అప్పుడే రెడీకూడా అవుతోందట. మొత్తానికి ఈ న్యూస్ ఖాన్స్ ఫ్యాన్స్ కు బిగ్ బ్రేకింగ్ న్యూసే. కానీ ఈ సినిమా విషయాలేవీ కూడా ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం క్రూ చెప్పకపోవటం హైలైట్.

- Advertisement -

పర్సనల్ లైఫ్ లో బిజీగా అమీర్

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాలు రాక చాలాకాలమైంది. 2022 ఏప్రిల్ లో లాల్ సింగ్ చద్దా అంటూ పలకరించిన అమీర్ ఆ తరువాత సినిమాల్లో కనిపించకుండా బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓవైపు కూతురుకి పెళ్లి చేసి మరోవైపు కొడుకుని హీరోగా లాంచ్ చేశాడు అమీర్. ఇప్పుడు మళ్లీ కాస్త టైం తీసి కెమరా ముందుకు ఏకంగా బ్లాక్ బస్టర్ సీక్వెల్ తో వస్తుండటం విశేషం. ఈమధ్యనే బిగ్ బాస్ లో అమీర్-సల్మాన్ కలిసి కాసేపు స్క్రీన్ పైన సందడి చేయగా అందరూ అందాజ్ అప్నా అప్నా సినిమానే గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీక్వెల్ రానుండటంతో బాలివుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడటం ఖాయంగా మారిందని అప్పుడే అంచనాలు స్టార్ట్ అయిపోయాయి.

సికందర్ తో సల్మాన్

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రష్మికతో కలిసి మురుగదాస్ సినిమా సికందర్ షూటింగ్ లో ఉన్నాడు. అయితే అమీర్ మాత్రం సితారే జమీన్ పర్ అనే సినిమా పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News