Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం కెరీర్‌లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన నటించిన సినిమాలు వరుసగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో నెక్ట్స్ ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో రామ్ ఆలోచనలో పడ్డాడనే టాక్ వినిపిస్తోంది. అలాగని ఆయనకు సినిమాలు లైనప్‌లో లేవని కాదు.. ఉన్న సినిమాలను ప్రేక్షకులను మెప్పించేలా ఎలా తెరకెక్కించాలనే ఆలోచిస్తున్నారని టాక్
రీసెంట్‌గా రిలీజైన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ కంటెంట్ పరంగా బెటర్ ఫిల్మ్‌గా చెప్పుకున్నప్పటికీ .. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన రేంజ్‌లో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో మాస్ సినిమాలా? కచ్చితమైన కమర్షియల్ కథలేనా? లేక లవ్ స్టోరీల వైపు మళ్లాలా? అనే ఆలోచనల్లో రామ్ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఓ కొత్త దర్శకుడు వినిపించిన థ్రిల్లర్ కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త తరహా ట్రీట్మెంట్‌తో రూపొందించాలనుకున్న ఈ సినిమా బడ్జెట్ పరంగా మాత్రం భారీగానే ఉంటుందనే చర్చ అప్పట్లోనే జరిగింది.
Also Read – Nikhil – Swayambhu: ‘స్వయంభు’ మళ్లీ పోస్ట్ పోన్?.. అసలు నిఖిల్ సినిమా పరిస్థితేంటి!
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ హిట్ అవుతుందని.. బిజినెస్ పరంగా తన మార్కెట్ మరింత పెరుగుతుందని నమ్మిన రామ్… కొత్త ప్రాజెక్ట్‌పై ముందుకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. ఆర్కా మీడియా కూడా అదే నమ్మకంతో ఉండింది. కానీ పరిస్థితులు మారాయి. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ రిజల్ట్ రివర్స్ కావటంతో ఇప్పుడు అదే స్థాయి బడ్జెట్‌తో మరో సినిమాను నిర్మించేందుకు ఆర్కా మీడియా వెనుకడుగు వేస్తోంది. అలాగని బడ్జెట్ తగ్గిస్తే సినిమా క్వాలిటీ దెబ్బ తినే అవకాశం ఉందనే టెన్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ తన రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయినప్పటికీ, అలా చేసినా బడ్జెట్ పూర్తిగా సర్దుబాటు అవుతుందా లేదా? అనే లెక్కలతో నిర్మాతలు ఇంకా తర్జనభర్జనలోనే ఉన్నారని సమాచారం. ఈ లెక్కలు తేలే వరకు ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడం కష్టమేనని అంటున్నారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే… రామ్ గత కొంతకాలంగా తన పారితోషికాన్ని పెంచలేదు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ తర్వాత మాత్రం రెమ్యునరేషన్ పెంచాలని భావించాడు. ఆర్కా మీడియాతో కూడా అదే అంశంపై అవగాహన కుదిరింది. కానీ తాజా పరిస్థితుల్లో పెంచడం అటుంచి, పాత పారితోషికం కూడా దక్కుతుందా లేదా అన్న అనిశ్చితి నెలకొందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
Also Read – Krithi Shetty: కృతీశెట్టి ఇచ్చిన ఝలక్.. శ్రీలీల పరిస్థితేంటి?

