Friday, December 12, 2025
HomeTop StoriesAndrea Jeremiah: నేను చేసింది న్యూడ్ సీన్లు కాదు..

Andrea Jeremiah: నేను చేసింది న్యూడ్ సీన్లు కాదు..

Andrea Jeremiah – Pisasu 2: మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్-సైకలాజికల్ థ్రిల్లర్ ‘పిసాసు 2’ (తెలుగులో ‘పిశాచి 2’) గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. కారణం – న్యూడ్ సీన్ల ఊహాగానాలు. ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెడుతూ కథానాయిక ఆండ్రియా జెర్మయా నోరు విప్పారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె “చిత్రంలో ఎరోటిక్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. కానీ న్యూడిటీ అస్సలు లేదు. ఒక్క సీన్ కూడా నగ్నత్వం చూపించేలా షూట్ చేయలేదు.” అని స్పష్టంగా చెప్పేశారు.

- Advertisement -

నిజానికి స్క్రిప్టు దశలో మిస్కిన్ బోలెడు న్యూడ్ సీన్లు రాశారని ఆండ్రియా ఆసక్తికర విషయం వెల్లడించారు. “స్క్రిప్టు చదివినప్పుడు నేనే షాక్ అయ్యాను. అంత ధైర్యంగా రాశారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత ఆయనే సొంతంగా ఆ సీన్లన్నీ తొలగించేశారు. ఇది ఆయన సృజనాత్మక నిర్ణయం” అని ఆమె వివరించారు.

మిస్కిన్‌తో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ ఆండ్రియా ఎమోషనల్ అయ్యారు. “గతంలో కొందరు దర్శకులు ఒక సీన్‌లో ‘స్కర్ట్ కిందకు దించు’ అని అడిగారు. నేను బట్టలు ధరించి ఉన్నా, వాళ్ల ఉద్దేశ్యం తప్పు. కానీ మిస్కిన్ సర్ అడిగినప్పుడు ఆ ఉద్దేశ్యం ఒక్క శాతం కూడా కనిపించలేదు. ఆయన విజన్‌ను నేను వంద శాతం నమ్మాను. అందుకే ధైర్యంగా ఒప్పుకున్నాను” అని చెప్పారు.

Also Read: Ram Pothineni: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

‘పిసాసు’ (పిశాచి) మొదటి భాగం 2014లో విడుదలై సూపర్ హిట్ అయింది. రెండో భాగం కూడా స్త్రీ పాత్రను కేంద్రంగా పెట్టుకొని రాసిన స్క్రిప్టే కావడం విశేషం. అయితే ప్రస్తుతం చిత్రం చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుపోయింది. థియేటర్లలో విడుదల ఆగిపోవడానికి కారణం నిర్మాతల మధ్య ఆర్థిక వివాదాలు. అయినా సినిమా చుట్టూ ఉన్న ఆసక్తి, చర్చ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా భారతీయ సినిమాలో ఇంటిమసీ, న్యూడిటీ, మహిళా పాత్రల చిత్రణపై జరుగుతున్న విస్తృత చర్చలో ‘పిసాసు 2’ కూడా కీలక అంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News