Wednesday, February 11, 2026
Homeచిత్ర ప్రభAnil Ravipudi: మెగాస్టార్ కాబట్టే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు- అనిల్ రావిపూడి

Anil Ravipudi: మెగాస్టార్ కాబట్టే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు- అనిల్ రావిపూడి

Anil Ravipudi: మెగాస్టార్ కాబట్టే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు.. అని అన్నారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో ఫ్లాప్ అంటే తెలియని దర్శకుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.

- Advertisement -

అయితే, మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను అనిల్ రావిపూడి పంచుకున్నారు. ఇప్పటికే మన శంకరవరప్రసాద్ గారు నుంచి వచ్చిన మీసాల పిల్ల, తాజాగా వచ్చిన శశిరేఖా చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Also Read- Krithi Shetty: సినిమా ప్లాపైతే నన్ను ట్రోల్ చేశారు..ఇండస్ట్రీ వద్దనుకున్నా!

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అనిల్ ప్రమోషన్స్‌లో తనదైన కొత్త స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. ఎప్పుడూ ప్రమోషన్స్‌కి నో చెప్పే హీరోయిన్ నయనతార కూడా మొదట్నుంచే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక, ఈ సినిమా కథ కంటే ముందు మెగాస్టార్ కి వేరే కథ చెప్పాడట అనిల్. అది అంతగా నచ్చకపోవడంతో ఇంకాస్త బెటర్ కథ చేయాలని మధ్యలోనే పారిపోయినట్టుగా చెప్పాడు. వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం చేసి హిట్ కొట్టాక మళ్ళీ చిరును కలినట్టుగా తెలిపిన అనిల్.. మీతో సినిమా చేస్తానని అడగగానే ఒప్పుకున్నారని చెప్పుకొచ్చాడు.

అలా, చిరంజీవి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఈ సందర్భంగా తెలిపాడు. ఇంకో హీరో అయితే రెండవ ఛాన్స్ ఇచ్చేవారు కాదని, మెగాస్టార్ కి సహనం ఎక్కువ..ఇప్పటి వరకూ నాకే ఎక్కువ సహనం ఉంటుందనుకున్నాను. కానీ, మెగాస్టార్ సహనం చూశాక అది తప్పనిపించిందని వెల్లడించాడు. కాగా, సంక్రాంతి బరిలో భారీ సక్సెస్ ఖాయమనే గట్టి నమ్మకాన్ని అనిల్ వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో వెంకీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చిరు-వెంకీలపై 10 రోజుల షూట్ జరిగింది. ఇద్దరిపై ఓ సాంగ్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు.

Also Read- Akhira Nandan: అకీరా నందన్ AI మూవీ యూట్యూబ్ లో సంచలనం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News