Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభAnil Ravipudi: ఊహించ‌ని కాంబో - అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాలో హీరో ఇత‌డేనా?

Anil Ravipudi: ఊహించ‌ని కాంబో – అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాలో హీరో ఇత‌డేనా?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అప‌జ‌య‌మే లేని ద‌ర్శ‌కుడిగా దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. ఇప్ప‌టివ‌ర‌కు ద‌ర్శ‌కుడిగా తొమ్మిది సినిమాలు చేస్తే అన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గానే నిలిచాయి. ఇటీవ‌లే సంక్రాంతికి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఈ మూవీ పండ‌గ విన్న‌ర్‌గా నిలిచింది. వారం రోజుల్లోనే మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండ‌స్ట్రీ హిట్ దిశ‌గా సాగుతోంది.

- Advertisement -

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారులో వింటేజ్ చిరంజీవి క‌నిపించార‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో అనిల్ రావిపూడి టేకింగ్‌, చిరంజీవి, వెంక‌టేష్ పాత్ర‌ల‌ను బ్యాలెన్స్ చేసిన తీరు, కామెడీ పండించిన విధానానికి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు త‌ర్వాత‌ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయ‌బోతున్నార‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌లో ఒక‌రితో అనిల్ రావిపూడి త‌దుప‌రి సినిమా ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రే కాకుండా మ‌రో హీరో పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. అఖిల్ అక్కినేనితో అనిల్ రావిపూడి సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Also Read – Ram Pothineni: బ‌డ్జెట్ లెక్క‌లేసుకుంటున్న నిర్మాత‌లు.. రిస్క్ చేస్తోన్న రామ్‌

వెంక‌టేష్ ఆద‌ర్శ‌ కుటుంబం త‌ర్వాత దృశ్యం 3 షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా అంటే ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో అనుకున్న టైమ్‌కు రావ‌డం క‌ష్ట‌మే. దాంతో సీనియ‌ర్ హీరోల‌ను ప‌క్క‌న‌ పెట్టిన అనిల్ రావిపూడి… అఖిల్‌తోనే సినిమా చేయాల‌ని ఫిక్సైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

అఖిల్ కూడా క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం ప‌దేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అనిల్ రావిపూడితో సినిమా చేస్తే అత‌డి కెరీర్‌కు బూస్ట‌ప్‌లా ఉంటుంద‌ని చెబుతున్నారు. నెక్స్ట్ సంక్రాంతికే అనిల్ రావిపూడి, అఖిల్ అక్కినేని సినిమా రిలీజ్ కానున్న‌ట్లు టాక్‌.

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు ప్రొడ్యూస‌ర్ సాహు గార‌పాటి బ్యాన‌ర్‌లోనే అఖిల్ – అనిల్ రావిపూడి మూవీ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు సంబంధించి స్టోరీతో పాటు టైటిల్ కూడా సిద్ధం చేశార‌ట అనిల్ రావిపూడి. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు లెనిన్ మూవీ షూటింగ్‌తో అఖిల్ బిజీగా ఉన్నాడు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ ప్రేమ‌క‌థా చిత్రం మే1న రిలీజ్ కాబోతుంది. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి ముర‌ళీకృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Also Read – Nikhil – Swayambhu: ‘స్వయంభు’ మళ్లీ పోస్ట్ పోన్?.. అసలు నిఖిల్ సినిమా పరిస్థితేంటి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News