Nandamuri Mokshagna: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరో ఎంట్రీ వ్యవహారం చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో నానుతూనే ఉంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఫాంటసీ సూపర్ హీరో మూవీతో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని బాలకృష్ణ అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మోక్షజ్ఞ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కానీ ఓపెనింగ్ ఈవెంట్ వరకు వెళ్లకముందే ఈ సినిమా ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ బాలకృష్ణతో పాటు మోక్షజ్ఞకు నచ్చలేదని సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాను పక్కన పెట్టిన బాలకృష్ణ… వారసుడి డెబ్యూ మూవీ కోసం మరికొంత మంది టాలీవుడ్ దర్శకులను అప్రోచ్ అయినట్లు వార్తలొచ్చాయి.
ఈ ప్రయత్నాలేవి వర్కవుట్ కాకపోవడంతో మోక్షజ్ఞను ఆదిత్య 369 సీక్వెల్‌తోనే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య ఫిక్సయ్యారట. తాజాగా ఈ సీక్వెల్‌కు దర్శకుడు కూడా ఖరారైనట్లు సమాచారం. టాలీవుడ్‌లో అపజయమే లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఆదిత్య 369 సీక్వెల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరింబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ సీక్వెల్‌కు దర్శకుడిగా క్రిష్ పేరు వినిపించింది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో ఫామ్ కోల్పోయాడు క్రిష్. దాంతో క్రిష్ కాదని సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలను అనిల్ రావిపూడికి బాలకృష్ణ అప్పగించినట్లు సమాచారం.
Also Read – Uday Kiran: చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ దర్శకుడికి ఏం చెప్పాడు.. ఇన్నేళ్ళకి వైరల్ అవుతున్న న్యూస్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్‌గారు సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. చిరంజీవి సినిమా విడుదల తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని ఆదిత్య 369 సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులను అనిల్ రావిపూడి మొదసినిమా పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఆదిత్య 369 సీక్వెల్‌లో మోక్షజ్ఞ తేజతో పాటు బాలకృష్ణ కూడా నటించబోతున్నాడు. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు ఇటీవల ఇఫీ వేడుకలో బాలకృష్ణ ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమాకు బాలకృష్ణనే స్వయంగా తన టీమ్‌తో కలిసి కథను సిద్ధం చేస్తుండటం గమనార్హం. అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే సినిమాసినిమా ఎక్కువగా చేశారు. ఆదిత్య 999 మ్యాక్స్ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అనిల్ రావిపూడి టేకాఫ్ చేసిన తర్వాత స్క్రిప్ట్‌లో తనదైన శైలిలో చాలా మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా బాలకృష్ణతో అనిల్ రావిపూడి చేయనున్న సెకండ్ మూవీ ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి నేషనల్ అవార్డును గెలుచుకుంది.
Also Read – Girija Oak: నీ రేటెంత అంటున్నారు.. నటి ఆవేదన

