Sunday, November 10, 2024
Homeచిత్ర ప్రభAha: తెలుగులో మరో కామెడీ షో.. ఈసారి ఓటీటీలో రాబోతుంది!

Aha: తెలుగులో మరో కామెడీ షో.. ఈసారి ఓటీటీలో రాబోతుంది!

- Advertisement -

Aha: మెయిన్ స్ట్రీమ్ లో బుల్లితెర మీద దాదాపు అన్ని ఛానెళ్లలో కామెడీ షోలు ప్రసారమవుతున్నాయి. కొన్ని చానెళ్లు ఇప్పటికే ఈ కామెడీ షో ప్రయోగాలు చేసి టీఆర్పీ పొందడంలో బొక్క బోర్లా పడి సర్ధేసుకున్నారు. ఇప్పటికీ కొన్ని ఛానెళ్లలో అరకొరగా టీఆర్పీలతో నెట్టుకొస్తుండగా.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ మాత్రం ఎప్పటికప్పుడు తన బ్రాండ్ ను నిలుపుకొని ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మల్లెమాల లాంటి ప్రొడక్షన్ సంస్థలు ఈ కామెడీ షోలలో ఏ మాత్రం తగ్గకుండా పండగలకు పబ్బాలకు ఈ షోల మాదిరి ఎడాపెడా ఈవెంట్ లు తీసుకొస్తుండగా.. ఇప్పుడు మన తెలుగులో కామెడీ షోలలో మరో ముందడుగుకు సన్నాహాలు మొదలయ్యాయి. టీవీలలో తప్ప ఓటీటీలలో, తెలుగులో ఇప్పటికీ కామెడీ షోలు లేవు. అయితే.. తెలుగు వారి ఓటీటీగా చెప్పుకుంటున్న ఆహా ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా కామెడీ షోకి సిద్ధమయ్యారు.

కామెడీ స్టాక్ ఎక్సేంజ్ పేరుతో రానున్న ఈ షో.. డిసెంబ‌ర్ 2 నుంచి ప్ర‌సారం కానుండగా.. స‌రిలేరు నీకెవ్వ‌రు, ఎఫ్‌2 సినిమాలతో స్టార్ డైరక్ట‌ర్‌గా మారిన అనిల్‌ రావిపూడి ఈ షోకి ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుడిగాలి సుధీర్‌, దీపిక పిళ్లై హోస్ట్ చేయనున్న ఈ షోలో సెల‌బ్రిటీ క‌మెడియ‌న్స్ వేణు, ముక్కు అవినాష్‌, స‌ద్దాం, ఎక్స్ ప్రెస్ హ‌రి, భాస్క‌ర్‌, జ్ఞానేశ్వ‌ర్ స్టాక్స్ గా ఉండనున్నారు. మరి సక్సెస్ ఫుల్ సంస్థగా పేరున్న ఆహా ఈ షోను ఎంతవరకు సక్సెస్ చేయనుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News