Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభANR Award to be presented to Chiru on Oct 28th: ఏఎన్ఆర్...

ANR Award to be presented to Chiru on Oct 28th: ఏఎన్ఆర్ అవార్డ్ 28న ప్రదానం

ఏఎన్ఆర్ శత జయంతి..

అక్టోబర్ 28న ఘనంగా ANR అవార్డు వేడుక, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును అందజేయనున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్

- Advertisement -

లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి గత నెల (సెప్టెంబర్ 20)న అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ANR స్మారక ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. అక్కినేని కుటుంబం, అనేక మంది గౌరవనీయ అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లెజెండరీ ANR గురించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

ANR లెగసీకి తగిన ట్రిబ్యూట్ గా, ఇండియన్ సినిమాకి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవికి ప్రతిష్టాత్మక ANR అవార్డును ప్రదానం చేయనున్నట్లు అక్కినేని కుటుంబం ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన జరగనున్న ఈ అవార్డు ప్రదానోత్సవానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ఏఎన్ఆర్ అవార్డు వేడుకకు ఆహ్వానించేందుకు నాగార్జున లాంఛనంగా చిరంజీవిని కలిశారు. పద్మవిభూషణ్‌ను అందుకున్న రెండవ తెలుగు వ్యక్తి చిరంజీవి, 2011లో ఏఎన్‌ఆర్‌గారే తొలిసారిగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఇండియన్ సినిమా డోయన్, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్, చిరంజీవికి అందజేయనున్నారు.

“మా నాన్న ANR గారి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది! 🎉 ఈ మైలురాయికి గుర్తుగా ANR అవార్డ్స్ 2024కి అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారిని ఆహ్వానించడం ఆనందంగా వుంది.🙏 ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం! 🙌 @AnnapurnaStdios #ANRLivesOn #ANRNationalAward #ANR100Years” అని నాగార్జున తన X అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని డిలైట్ ఫుల్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగార్జున, చిరంజీవిని ఒకే ఫ్రేం లో చూడటం అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా నిలిచింది. నాగార్జున, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ ఈవెంట్ విజువల్ ఫీస్ట్‌గా వుండబోతోంది.

ANR అవార్డు గతంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవానంద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత షబానా అజ్మీ, అంజలీ దేవి, డాక్టర్ వైజయంతిమాల బాలి, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కె. బాలచందర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత హేమమాలిని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ శ్యామ్ బెనెగల్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్.ఎస్. రాజమౌళి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీదేవి బి కపూర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రేఖ లాంటి దిగ్గజాలకు అందించారు.

ANR గ్రేట్ లెగసీ, ఇండియన్ సినిమాపై ఆయన చెరగని ముద్రని సెలబ్రేట్ చేసుకునే ఈ వేడుక మరపురాని చారిత్రాత్మక ఘట్టంగా వుండబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News