Homeచిత్ర ప్రభBhogi Movie: శర్వానంద్ ‘భోగి‘ మూవీ.. అనుపమ ఫస్ట్ లుక్ రిలీజ్

Bhogi Movie: శర్వానంద్ ‘భోగి‘ మూవీ.. అనుపమ ఫస్ట్ లుక్ రిలీజ్

Anupama Parameswaran First Look: శర్వానంద్‌ బైకర్ తో మంచి విజయం సాధించాడు. ఈ మూవీ తర్వాత అతడు నటిస్తున్న చిత్రం భోగి. సంపత్ నంది తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 1960 నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి శర్వానంద్ లుక్ విడుదల చేసింది మూవీ. ఇందులో శర్వా కత్తి పట్టుకుని సీరియస్ మాస్ లుక్ లో కనిపించాడు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది రివేంజ్ డ్రామా అని అర్థమైపోతుంది.

- Advertisement -

ఈ సినిమాలోని శర్వా లుక్ మూవీపై అంచనాలు పెంచింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. భోగిలో అనుపమ కందుల సులోచన రాణి అనే పాత్రలో కనిపించనుంది ఈ సందర్భంగా మూవీ టీం ప్రకటించింది. హాఫ్ శారీలో తలపై, చేతుల్లో ఆకులతో మూటను ఎత్తుకుని, చేతికి క్యారేజీ వేలాడేసుకుని పల్లేటూరి యువతిగా కనిపించింది.

బోల్డ్, డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించడంతో ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. పోస్టర్‌తో పాటు చిత్ర యూనిట్‌ ఇలా ఒక క్యాప్షన్‌ కూడా చేర్చింది. “ప్రకృతి బిడ్డ… గంగా నిలయం… కందుల గర్వం… భోగికి ప్రాణం” అంటూ సినిమాలో అనుపమ పాత్ర గురించి వర్ణించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్‌ స్టోరీని పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో డింపుల్ హయాతి, రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News