Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన మలయాళం లీగల్ థ్రిల్లర్ మూవీ జేఎస్‌కే (జానకి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ) మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 15 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. జీఎస్‌కే స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సెన్సార్ నుంచి ఇబ్బందులు…
జానకి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. టైటిల్ కారణంగా ఈ సినిమా సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నది. తొలుత ఈ సినిమాకు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే టైటిల్‌ను మేకర్స్ కన్ఫామ్ చేశారు. లైంగిక దాడులకు గురైన అమ్మాయికి జానకిగా పేరు పెట్టడాన్ని సెన్సార్ బోర్డ్ వ్యతిరేకించింది. సినిమా పేరును మార్చాలని ఆదేశించింది. అలాగే సినిమాలో 96 సీన్స్‌ను కట్ చేయాలని సూచించింది.
Also Read- Smart Tv: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. రూ.20 వేల కంటే తక్కువ ధరలో 43 అంగుళాల స్మార్ట్ టీవీలు..
కమర్షియల్ ఫెయిల్యూర్…
అందుకు సినిమా యూనిట్ ఒప్పుకోకపోవడంతో చివరికి వివాదం రీజనల్ కమిటీ నుంచి కోర్టు వరకు వెళ్లింది. చివరకు ఈ వివాదంలో వెనక్కి తగ్గిన సినిమా యూనిట్ మూవీ పేరు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మార్చేసింది. ఈ వివాదం కారణంగా మేలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండు నెలలు ఆలస్యంగా జూలైలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో వివాదాలకు దాటుకొని ప్రేక్షకుల ముందుకొచ్చిన జేఎస్‌కే మూవీ కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని అందుకోలేదు.
జేఎస్‌కే కథ ఏంటంటే?
ఈ సినిమాలో లైంగిక దాడులకు గురైన అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించింది. తనకు జరిగిన అన్యాయంపై పోరాడే మహిళగా ఛాలెంజింగ్ రోల్‌లో అసమాన నటనతో ఆకట్టుకుంది. జానకి విధ్యాధరన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం సొంతూరు కేరళకు వస్తుంది. తిరుగు ప్రయాణంలో జానకి లైంగికదాడికి గురవుతుంది. తనకు జరిగిన అన్యాయంపై చట్టప్రకారం పోరాడాలని నిర్ణయించుకుంటుంది. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు సొసైటీలో కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రయత్నాలు చేస్తారు. జానకి తరఫున ఈ కేసు వాదించడానికి డేవిడ్ అబెల్ డోనోవన్ ముందుకొస్తాడు. లాయర్ డేవిడ్ కథేమిటి? జానకి కేసును అతడు ఎందుకు వాదించాడు? అసలైన దోషులను కోర్టు ముందు డేవిడ్ నిలబెడ్డాడా? జానకికి న్యాయం జరిగిందా? అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో మూడు సినిమాలు…
ప్రస్తుతం తెలుగులో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది అనుపమ పరమేశ్వరన్. ఆమె హీరోయిన్‌గా నటించిన పరదా, కిష్కిందపురి సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. శర్వానంద్, సంపత్‌నంది సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతుంది. తమిళంలో రెండు, మలయాళంలో మరో సినిమా చేస్తుంది అనుపమ పరమేశ్వరన్.


