Ghati: సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ‘ఘాటి’ సినిమా టీజర్ తోనే బ్లాక్‌బస్టర్ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న ఈ సినిమా జూలై నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. అనుష్క శెట్టి-క్రిష్ కాంబోలో 14 ఏళ్ల క్రితం వేదం సినిమా చచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. మల్లీ ఇంతకాఅనికి వీరి కాంబోలో ఘాటి వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఘాటి చిత్రాన్ని రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొంచినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే, థియేట్రికల్‌గా రూ.12 కోట్ల బిజినెస్ చేసినట్టుగా ఇండస్ట్రీ టాక్. ఇక ఓటీటీ, ఆడియో రైట్స్ ద్వారా రూ.38 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. దీంతో టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.50 కోట్లు వరకు చేరింది. ఒక్కోసారి పెద్ద స్టార్ హీరో సినిమా కూడా ఈ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగదు. అలాంటిది ఈ మధ్యకాలంలో అనుష్కకి ఆశించిన విజయాలు దక్కకపోయినా ఘాటి మాత్రం అవాక్కయ్యే బిజినెస్ చేసింది.
మొత్తానికి అనుష్క ఘాటి చిత్రం రిలీజవక ముందు నుంచే లాభాల్లోకి వచ్చేసింది. అందుకే, ఫ్లాపులతో సంబంధం లేకుండా అనుష్క రేంజ్ చెక్కు చెదరలేదని మాట్లాడుకుంటున్నారు. గతంలో సోలో హీరోయిన్గా అనుష్క నటించిన ‘అరుంధతి’, ‘వేదం’, ‘భాగమతి’, ‘రుద్రమదేవి’ సినిమాలతో తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు అనుష్క. అయితే, ‘బాహుబలి’ సిరీస్ తర్వాత అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీనికి కారణం సైజ్ జీరో సినిమాతో ఆమె చేసిన పెద్ద ప్రయోగమే.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/dhanush-nagarjuna-rashmika-kubera-movie-1st-day-collections/
నిశ్శబ్ధం పాన్ ఇండియా వైడ్‌గా వచ్చి ఆమెను తీవ్రంగా నిరాశపరచింది. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ నవీన్ పోలిశెట్టి సినిమా చేశారు. కానీ, ఈ సినిమా కథ..కథనాలు పరమ బోర్ కొట్టడంతో ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. అయినా వీటి ప్రభావం అనుష్క మీద ఏమాత్రం పడలేదని ఘాటీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే అర్థమవుతోంది. చూడాలి మరి ఈ సినిమాతో మళ్ళీ స్వీటీ సాలీడ్‌గా కంబ్యాక్ ఇస్తారేమో.