Kathanar Trailer: ‘బాహుబలి’ చిత్రాల తర్వాత అనుష్క శెట్టి కెరీర్ స్లో అయ్యింది. నిజానికి అనుష్క బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాల తర్వాత ఆమె కెరీర్ ఇంకా ఫుల్ హైప్‌లో ఉంటుందని అంత భావించారు. కానీ, అందుకు భిన్నంగా స్విటీ సినిమాలు బాగా తగ్గించేసింది. అడపదడప సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
ఘాటి డిజాస్టర్
చివరిగా ఆమె ఘాటీ సినిమాతో అలరించింది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణ పరాభవం చూసింది. ఎన్నో అంచనాలు వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక కాస్తా గ్యాప్ తీసుకుని మరో మూవీతో వస్తోంది. అదే ‘కథనార్’. మలయాళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళంలోనూ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ట్రైలర్ విడుదల చేశారు.
అద్బుతమైన విజువల్స్
అద్భుతమైన విజువల్స్, ఆసక్తికరమైన కథాంశం, అంతుచిక్కని రహస్యాలతో సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ మూవీలో వాడిన సినిమాటోగ్రఫీ ఎంతో సహజంగా ఉండి సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ టీజర్ ట్రైలర్ చూసిన ఆడియన్స్, ఫ్యాన్స్ అంత అనుష్క ఖాతాలో ఈసారి ఓ భారీ హిట్ ఖాయం అంటున్నారు. అయితే, ఇందులో అనుష్క నాలుగు, అయితే షాట్స్‌కే పరిమితం చేసినా.. విజువల్స్, ఆమె లుక్ మాత్రం ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది.
రోజిన్ థామస్ దర్శకత్వంలో ఫాంటసీ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుష్క సరసన జయ సూర్య హీరోగా నటిస్తున్నాడు. గతంలో ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎలాగైతే మంత్రముగ్ధులను చేసిందో.. కథనార్‌లోనూ అదే ఆమె పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. కేరళ జానపద కథల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

