Anushka Shetty: డైరెక్టర్ క్రిష్ ఏ సినిమా చేసినా రిలీజ్ వాయిదాలు అతడిని వెంటాడుతూనే ఉన్నాయి. క్రిష్ సినిమా అంటేనే రిలీజ్ డేట్స్ మారడం, పోస్ట్‌పోన్ కావడం కామన్ అయిపోయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన హరిహరవీరమల్లు దాదాపు పన్నెండు సార్లు రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. హరిహరవీరమల్లు నుంచి మధ్యలోనే తప్పుకున్న క్రిష్… అనుష్కతో ఘాటి సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చారు. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికీ రెండుసార్లు మారింది.
ఏప్రిల్ 18న…
ఘాటి సినిమాను ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు క్రిష్ ప్రకటించాడు. కానీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో జూలై 11కు వాయిదావేశారు. ఈ డేట్‌కు కూడా సినిమా థియేటర్లలోకి రాలేదు. ఘాటి అన్నది సజీవ నది లాంటిది కొన్నిసార్లు ముందుకు పరిగెడుతుంది, కొన్నిసార్లు లోతును సేకరించడానికి ఆగిపోతుందంటూ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్ట్‌పోన్‌కు సంబంధించిన ప్రకటనను ఇటీవల రిలీజ్ చేసింది. ప్యాచ్ వర్క్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంటూ ఇంకా ఈ సినిమాకు క్రిష్ తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నాడని సమాచారం.
Also Read – DNA Movie: శుక్రవారం థియేటర్లలో రిలీజ్ – శనివారం ఓటీటీ స్ట్రీమింగ్ – ఓ మై బేబీ ట్విస్ట్!
సెప్టెంబర్ 5న…
ఆగస్ట్ నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉండటంతో ఘాటి కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడం మేకర్స్‌కు పెద్ద సమస్యగా మారినట్లు సమాచారం. పలు రిలీజ్ డేట్స్ పరిశీలించిన మేకర్స్ తాజాగా సెప్టెంబర్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆగస్ట్ నెలాఖరు నుంచి సెప్టెంబర్ సెకండ్ వీక్ వరకు పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో సెప్టెంబర్ 5ను రావాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు చెబుతోన్నారు. ఈ రిలీజ్ డేట్‌ను త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించబోతున్నట్లు తెలిసింది. అయితే సెప్టెంబర్ 5న అయినా ఘాటి రిలీజ్ అవుతుందా? క్రిష్ తన మాట నిలబెట్టుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఛాలెంజింగ్ రోల్…
ఘాటి మూవీలో కరుడుగట్టిన క్రిమినల్‌గా అనుష్క ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత సినిమాలకు పూర్తి భిన్నంగా స్విటీ రోల్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. ఘాటితోనే ఈ కోలీవుడ్ యాక్టర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రమ్య కృష్ణ, చైతన్యరావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఘాటి మూవీకి సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూర్చుతున్నాడు.
Also Read – Arrest: సోషల్ మీడియాలో అలాంటి వీడియో పెట్టినందుకు నలుగురు అరెస్ట్!
మలయాళంలోకి ఎంట్రీ…
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సక్సెస్ తర్వాత అనుష్క నటిస్తున్న తెలుగు మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది హీరోయిన్‌గా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది అనుష్క. కథనార్ పేరుతో ఓ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ చేస్తుంది.


