Homeచిత్ర ప్రభHBD Pawan Kalyan: పవర్ స్టార్ .. కింగ్ మేకర్.. పవన్ కళ్యాణ్

HBD Pawan Kalyan: పవర్ స్టార్ .. కింగ్ మేకర్.. పవన్ కళ్యాణ్

HBD Pawan Kalyan: ఎక్కడి కళ్యాణ్ బాబు… ఎక్కడి పవర్ స్టార్… ఎక్కడి జనసేనాని! పేర్లు మారినా వ్యక్తి ఒకడే – పవన్ కళ్యాణ్. అభిమానుల గుండెల్లో దేవుడిలా కొలువై ఉన్న ఈ వ్యక్తి సినీ తెర మీద హీరోగా, నిజ జీవితంలో నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. విశేషమైన విషయం ఏంటంటే, ఆయన్ని అభిమానించడానికి కారణం కేవలం హిట్లు కాదు. ఆయన బ్లాక్‌బస్టర్ కాదు అయినా బ్లడ్‌బస్టర్. ఆయన చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటలో గంభీరత, చూసే చూపులో స్పష్టత. ఇవే ఆయన్ని మిగతా వారికంటే వేరుగా నిలబెట్టాయి.

- Advertisement -

Also Read- Ustaad Bhagat Singh Poster: పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రీట్..‘ఉస్తాద్ భగత్ సింగ్’ న్యూ లుక్.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పక్కా

మాస్‌తో పాటు క్లాస్‌ ఆడియెన్స్ హీరో
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయిన పవన్ కళ్యాణ్‌కి మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ “తమ్ముడు”, “తొలిప్రేమ”, “బద్రి”, “ఖుషి” వంటి చిత్రాలతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక “జానీ” అనే డిజాస్టర్ తర్వాత ఆయన మళ్లీ లెవెల్‌కి వచ్చిన తీరు అసలే నాటకీయంగా ఉంటుంది. “గబ్బర్ సింగ్” రూపంలో వచ్చిన రీబౌండ్ తో ఫ్యాన్స్ కల్ట్ మ‌రింత బ‌లపడింది. ఆయన స్టైల్, మేనరిజం, డైలాగ్ డెలివరీ, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే తీరు – ఇవన్నీ ఒక స్పెషల్ బ్రాండ్‌ను తీసుకొచ్చాయి. “పవన్ కళ్యాణ్ బ్రాండ్” అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది.

సెలబ్రిటీ నుంచి ప్రజాసైనికుడిగా
సినిమాల ద్వారా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పవన్, ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట CMPF, తరువాత అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యంలో మద్దతు, చివరికి “జనసేన” అనే స్వంత పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. అప్పట్లో విమర్శలు చేసినవాళ్లే.. నేడు ఆయన్ని డిప్యూటీ సీఎం పదవిలో చూసి అభినందిస్తున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయం కోసమే రాజకీయం చేయలేదు… ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు.

వివాదాలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలు – ఇవన్నీ ఎదురైనా.. నిలబడి, నడిచి, పని చేసి చూపించారు. మామూలుగా స్టార్స్ డౌన్ ఫాల్ అయితే ఆ రైజ్ మళ్ళీ కష్టమే. కానీ పవన్ మాత్రం ప్రజలపై ఉన్న నమ్మకంతో తిరిగి లేచి నిలబడ్డారు.

Also Read- Pawan Kalyan : చంద్రబాబు నాయుడు భవిష్యత్ దార్శనికుడు – పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎంగా…
గెలిచిన తర్వాత ఎందులోనూ వెనక్కి తగ్గని పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాక గ్రామాల అభివృద్ధిపై పూర్తి ఫోకస్ పెట్టారు. “సీఎం స్టేట్ చూసుకుంటే, నేను గ్రామాలు చూసుకుంటాను” అనే మాటే ఆయన పని తీరు చూపిస్తోంది. రాష్ట్రంలో ప్రతీ సమస్యపై స్పందిస్తూ, పర్యటిస్తూ, అధికారులపై ఒత్తిడి తేవడం, పరిష్కారాలు కనుగొనడం ఆయన పని పద్ధతిని ప్రతిబింబిస్తుంది. పంచాయతీ రాజ్ శాఖను స్వయంగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అభిమానులకు, కార్యకర్తలకు విలువ ఇచ్చే తీరు కూడా ఆయనకే ప్రత్యేకం. ఇటీవల జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, “మీరు నాయకులవుతారు” అనే కొత్త మార్గదర్శకాన్ని ఇచ్చారు.

కథానాయకుడిగా ప్రజలకు పరిచయమై ఇప్పుడు ప్రజా నాయకుడిగా సేవలు అందిస్తోన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఇలాంటి పుట్టినరోజులను మరెన్నింటిలో జరుపుకోవాలని కోరుకుందాం..
హ్యపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News