Sunday, January 18, 2026
Homeచిత్ర ప్రభMSVG: ఏపీలో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాగ్‌గారు టికెట్ రేట్లు పెంపు - తెలంగాణ ప‌రిస్థితి ఏంటి?

MSVG: ఏపీలో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాగ్‌గారు టికెట్ రేట్లు పెంపు – తెలంగాణ ప‌రిస్థితి ఏంటి?

MSVG: ఈ సంక్రాంతి సీజ‌న్ టాలీవుడ్‌కు అచ్చిరాలేదు. ఇది వ‌ర‌కు సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ లెక్క‌లు, రికార్డులు, అడ్వాన్స్ బుకింగ్స్ గురించి చ‌ర్చ‌లు జ‌రిగేవి. ఈ సంక్రాంతికి మాత్రం కోర్టు కేసులు, పోస్ట్‌పోన్‌లు, టికెట్ రేట్ల కోసం ప‌డిగాపులు ఇవే క‌నిపిస్తున్నాయి. రాజాసాబ్‌కు తెలంగాణ‌లో బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. జీవో అదిగో ఇదిగో అంటూ గురువారం రాత్రి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కేవ‌లం టికెట్ రేట్లు మాత్ర‌మే పెంచుకునేలా మెమో జారీ చేసింది. మ్యాట్నీ షోలోపే ఆ మోమోను హైకోర్టు కొట్టివేసింది. ఇక‌పై సినిమాల టికెట్ ధ‌ర‌లు పెంచ‌ద్దంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

- Advertisement -

రాజాసాబ్ త‌ర్వాత రిలీజ‌య్యే నాలుగు సంక్రాంతి సినిమాల‌కు టికెట్ రేట్ల పెంపు ఉండ‌క‌పోవ‌చ్చున‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీకి టికెట్ రేట్ల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. రిలీజ్‌కు ముందురోజు జ‌న‌వ‌రి 11న స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షోకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఈ బెనిఫిట్‌షోకు జీఎస్‌టీతో క‌లిపి ఐదు వంద‌లు ధ‌ర‌ను నిర్ణ‌యించింది. రిలీజ్ రోజు నుంచి ప‌ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో వంద‌, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 125 రూపాయ‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించింది. ప్ర‌తి రోజు ఐదు షోల‌కు అనుమ‌తి ఇచ్చింది.

Also Read – Nani – Sujeeth: నాని-సుజీత్ మూవీలో హీరోయిన్ ఆ బ్యూటీనేనా?

ఏపీలో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండ‌వ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. మ‌రి తెలంగాణ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది అభిమానుల‌తో పాటు టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. రాజాసాబ్ టికెట్ ధ‌ర‌ల మెమోను కొట్టివేసిన నేప‌థ్యంలో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌కు కూడా టికెట్ రేట్లు పెర‌గ‌డం అనుమాన‌మేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

శుక్ర‌వారం త‌న తీర్పులో 120 జీవోను హైకోర్టు హైలైట్ చేసింది. ఈ జీవో ప్ర‌కారం సినిమాల టికెట్ రేట్లు 350కి మించి ఉండ‌కూడ‌దు. ఒక‌వేళ టికెట్ రేట్లు అంత‌కుమించి పెంచాలంటే ఆ జీవోను స‌వ‌రించాల‌ని అన్న‌ది. రాజాసాబ్ టికెట్ రేట్ల‌ను పెంచిన అధికారుల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ ప‌రిణామాల దృష్ట్యా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల‌కు మేక‌ర్స్ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దిస్తారా? లేదా? చ‌ర్చ‌నీయంశంగా మారింది. చివ‌రి నిమిషం వ‌ర‌కు ఎదురుచూసే టెన్ష‌న్‌ల‌ను పుల్‌స్టాప్ పెడుతూ రెగ్యుల‌ర్ ధ‌ర‌ల‌తోనే వెళ్ల‌డం బెస్ట్ అనే మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మేక‌ర్స్ అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. రాజాసాబ్ మూవీకి సంబ‌ధించి తెలంగాణ‌లో ప‌ర్మిష‌న్స్ కోసం ఎదురుచూడ‌టంతో గురువారం రాత్రి వ‌ర‌కు టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. దాంతో నైజాంలో ఫ‌స్ట్ డే బుకింగ్స్ చాలా త‌క్కువ‌గా జ‌రిగాయి. రాజాసాబ్‌కు ఎదురైన ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ‌లో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ మేక‌ర్స్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటున్నార‌న్న‌ది చూడాల్సిందే.

Also Read – Prabhas: ప్రభాస్‌ని మారుతి నిజంగానే జోకర్‌ని చేశాడా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News