Homeచిత్ర ప్రభArjun Das: గుండె ముక్కలు చేసి వేళ్లిపోతారు.. బ్రేకప్‌ పోస్ట్‌తో షాకిచ్చిన అర్జున్‌ దాస్‌

Arjun Das: గుండె ముక్కలు చేసి వేళ్లిపోతారు.. బ్రేకప్‌ పోస్ట్‌తో షాకిచ్చిన అర్జున్‌ దాస్‌

Arjun Das Break Up Post Viral:నటుడు, హీరో అర్జున్‌ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా దక్షిణాదిలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తన గొంతుతో అర్జున్‌ దాస్‌కి మరింత క్రేజ్‌ పెరిగింది. ఏ షోలో అయినా, అవార్డు ఫంక్షన్‌తో మైక్‌ పట్టుకునే హాలో అంటే చాలు.. షో మొత్తం అరుపులు, ఈళలతో మారుమ్రోగుతుంది. సింహానికి మాటలు వస్తే అవి ఇలాగే ఉంటాయామో అంటూ అర్జున్‌ దాస్‌ వాయిస్‌ని కొనియాడుతుంటారు. అలా తనదైన స్టైల్‌, విలక్షణమైన గొంతుతో ప్రేక్షకులు మనసు దొచుకున్నాడు.

- Advertisement -

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
అంతేకాదు ఇండస్ట్రీలో అతడికి లేడీ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. సౌత్‌ ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న అతడిపై ఇప్పటి వరకు డేటింగ్‌, రిలేషన్‌ వంటి రూమర్స్‌ ఎప్పుడు, ఎక్కడ వినిపించలేదు. ఎంతో లేడీ ఫాలోయింగ్‌ ఉన్న అతడు ఎప్పుడు ప్రేమ గురించి కూడా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో అర్జున్‌ దాస్‌ చేసిన ఓ బ్రేకప్‌ పోస్ట్ ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది అంతా షాక్‌ అవుతున్నారు. ఎప్పుడు ప్రేమ గురించి మాట్లాడని అర్జున్‌.. సడెన్‌ బ్రేకప్‌ గురించి చెప్పడం.. గుండె ముక్కలైందనడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకి అతడు ప్రేమించిన అమ్మాయి ఎవరూ.. ఎవరితో బ్రేకప్‌ అయ్యిందా అని ఆరా తీస్తున్నారు.

అలా ఎలా మూవ్ ఆన్ అవుతారు..
ఇంతకి అతడి పోస్ట్‌లో ఏముందంటే.. “ఎప్పుడైతే మనం ఒకరిని గాఢంగా ప్రేమిస్తామో.. అప్పుడు వారు మన గుండెని ముక్కలు చేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు?” అంటూ హార్ట్‌ బ్రేక్‌ ఎమోజీతో పోస్ట్‌ చేశాడు. ఇది చూసి ప్రతి ఒక్కరు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఎప్పుడు లేనిది ఈ హీరో ఎందుకు బ్రేకప్‌ పోస్ట్‌ పెట్టాడని ఆలోచనలో పడ్డారు. నిజంగానే అర్జున్‌ దాస్‌ ప్రేమలో దెబ్బ తిన్నాడా? అందుకే ప్రస్తుతం ప్రేమ, పెళ్లికి దూరంగా ఉన్నాడా? అంటున్నారు. గతంలో ఓ అవార్డు షోలో హోస్ట్‌ అర్జున్‌ ఇలా అడిగింది. లవ్‌ మ్యారేజ్‌ లేదా అరెంజ్డ్‌ మ్యారేజ్‌ అని అడిగితే నో మ్యారేజ్‌ అని టక్కున సమాధానం ఇచ్చాడు.

Also Read: Jr NTR Look: ఆందోళన కలిగిస్తున్న ఎన్టీఆర్‌ లుక్‌.. నీల్‌ మావ ఏం ప్లాన్‌ చేస్తున్నావ్‌!

అంటే అతడికి బ్రేకప్‌ ఎప్పుడో అయిందా? ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా ఎమోషనల్‌ అయ్యాడని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఏమో ఇది తన వ్యక్తిగత లైఫ్‌కి సంబంధించిన కాదని, ప్రొఫెషనల్‌ లైఫ్‌కి సంబంధించిందేమో అని సందేహిస్తున్నారు. ఈ పోస్ట్‌ తన సినిమాకు సంబంధించిందైనా లేదా ఏదైనా ప్రైవేట్‌ అల్బమ్‌లో నటిస్తున్నాడమో అని అంచనాలు వేసుకుంటున్నారు. ఏదేమైనా సినిమాల్లో తన వాయిస్‌తోనే కాకుండ.. ఇలా బ్రేకప్‌ పోస్ట్‌తో కూడా అందరిని కదిలించాడని, ఒక్క పోస్ట్‌తో ఏడిపించేశాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఈ పోస్ట్‌ క్లారిటీ రావాలంటే స్వయంగా అర్జున్‌ దాస్‌ ఒపెన్‌ అయ్యే వరకు వేయిట్‌ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News