నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా నటిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi) మూవీ నుంచి మరో పాట విడుదలైంది. ‘ముచ్చటగా బంధాలే’ (Muchataga Bandhaale) అంటూ సాగే లిరికల్ పాటను చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో కళ్యాణ్‌రామ్-విజయశాంతి తల్లికొడుకులుగా అలరించారు. రఘురామ్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హరిచరణ్ ఆలపించారు.
కాగా అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సోహెల్ ఖాన్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కాంతార’ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాట, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 18న విడుదల కానుంది.