Homeచిత్ర ప్రభAshu Reddy: అషురెడ్డి పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Ashu Reddy: అషురెడ్డి పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Ashu Reddy: బిగ్‌బాస్ ఫేమ్,నటి అషురెడ్డి కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నోట్ ని అషు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఇటీవల ఆమెపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.35 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్‌లో అషుపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు అషు పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మె.. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది. సోమవారం తదుపరి విచారణ జరగనుంది.

- Advertisement -

ఈ క్రమంలో హైకోర్టు మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి అషురెడ్డి షేర్ చేస్తూ మీడియాకు విజ్ఞప్తి చేసింది. ‘గత కొన్నిరోజుల నుంచి నాపై మీడియా, సోషల్ మీడియా, కంటెంట్ క్రియేటర్స్ నిరాధార కథనాలు ప్రసారం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం నాపై వచ్చిన ఆరోపణల కేసు.. కోర్టు పరిధిలో ఉంది. నా పరువుకు భంగం కలిగించే కంటెంట్ ప్రసారం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇది గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, నెటిజన్లని కోరుతున్నా. కోర్టు ఆదేశాల మేరకు నాపై ఉన్న అభ్యంతరకర పోస్టులు తొలగించాలని, కొత్తవి పబ్లిష్ చేయకుండా సహకరించాలని కోరుతున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్. రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి’ అని పేర్కొంది.

Also Read: OTT: డైరెక్ట్ గా ఓటీటీకి క్రైం థ్రీల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈ కేసు విషయం బయటకొచ్చిన తర్వాత తామేం తప్పు చేయలేదని అషురెడ్డి, ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అషురెడ్డి మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకొచ్చింది. ఇందులో మే నెల వరకు టైమ్ ఇస్తే కోటిన్నర తిరిగి ఇచ్చేస్తా, మిగిలిన డబ్బులు జీవితంలో స్థిరపడినప్పుడు ఇచ్చేస్తా అని ధర్మేంద్రతో మాట్లాడుతున్నట్లు ఉంది. మరోవైపు ధర్మేంద్రకు సంబంధించిన ఆరు నిమిషాల ఆడియో కూడా వైరల్ అవుతోంది. ఇందులో ఇతడు మాట్లాడుతూ అప్పు చేసి మరీ అషురెడ్డికి డబ్బులిచ్చానని.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్లే కేసు పెట్టాల్సి వచ్చిందని మాట్లాడినట్లు ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News