హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ నాయకులు ఇంటిని ముట్టడించారు. ఇంటి గోడలు ఎక్కి గేటు లోపలికి దూసుకెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అనంతరం ఇంటి ముందు భైఠాయించి నిరసన చేపట్టారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో బన్నీ కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదు. ప్రస్తుతం అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.
- Advertisement -