Saturday, May 18, 2024
Homeచిత్ర ప్రభAvatar 2 : వామ్మో.. అవతార్ 2 టికెట్ రేట్లు మరీ ఇంతా ?

Avatar 2 : వామ్మో.. అవతార్ 2 టికెట్ రేట్లు మరీ ఇంతా ?

అవతార్.. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి భారీ విజయం సాధించింది. ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయేలా చేసింది. అద్భుతమైన విజువల్స్ తో పండోరా అనే గ్రహాన్ని, కొత్త భాషని సృష్టించి దర్శకుడు జేమ్స్ కామెరూన్ అందర్నీ తన వైపుకి తిప్పుకున్నాడు. మళ్లీ ఇప్పుడు అదే దర్శకుడు అవతార్ 2 తో వస్తున్నాడు. అవతార్:ది వే ఆఫ్ వాటర్ అనే పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా 2డీ, 3డీ, 4డీఎక్స్ 3డీ, ఐమ్యాక్స్3డీ ఫార్మట్లలో సినిమా విడుదల కాబోతోంది.

- Advertisement -

ఇటీవలే విడుదలైన అవతార్ 2 ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మొత్తం 160 భాషల్లో అవతార్ 2 ను విడుదల చేయబోతున్నారు. రూ.100 కోట్లకు పైగా ఖర్చుతో తీసిన ఈ సినిమా తొలిరోజే రూ.40 కోట్ల బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. మన దేశంలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. విడుదలకు ఇంకా 20 రోజులకు పైగా సమయం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ లు ఓపెన్ అయ్యాయి.

కానీ.. టికెట్స్ బుక్ చేసుకుందామని బుకింగ్స్ పేజ్ ఓపెన్ చేసిన వారంతా రేట్లు చూసి.. షాకవుతున్నారు. వామ్మో ఒక్క టికెట్ ఇంత రేటా ? అని నోరెళ్లబెడుతున్నారు. ఒక్కో సిటీలో.. ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో రేటు ఉండటమే ఇందుకు కారణం. అభిమాన హీరోల సినిమాల టికెట్ ధరలకంటే రెండు మూడింతలు ఎక్కువగా ఉంది అవతార్ 2 టికెట్ రేటు.

హైదరాబాద్ లో 4డీఎక్స్ ఫార్మెట్ లో టికెట్ ధర రూ. 350, బెంగళూరులో ఐమ్యాక్స్ ప్రీమియం సీట్ల ధర రూ. 1500, 3డీ ప్రీమియం రూ.1650, ముంబయిలో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో గరిష్టంగా రూ.1700, కనిష్టంగా రూ.740, ఢిల్లీలో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ. 1000, కలకత్తాలో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ. 800, అహ్మదాబాద్ లో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ.750, చండీగడ్ లో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో రూ.400, పూణెలో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో రూ.900 ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News