Balagam Venu and DSP: ‘బలగం’ వేణు డైరెక్షన్‌లో డీఎస్పి.. ఎల్లమ్మ ఏమైనట్టు..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. కమెడియన్‌గా పాపులర్ అయిన వేణు.. ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో ద్వారా కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు. సాధారణంగా హీరోలు డైరెక్టర్స్ అవడం చూశాము గానీ, ఒక చిన్న కమెడియన్ డైరెక్టర్ అవడం.. హిట్ కొట్టడం.. దాంతో బడా నిర్మాణ సంస్థలు ఆఫర్ ఇవ్వడం చాలా అరుదుగా జరిగే విషయం.
అది, కమెడియన్ వేణు విషయంలో జరిగింది. ఎవరూ ఊహించని విధంగా బలగం అనే కథను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దాంతో వేణులో మంచి దర్శకుడున్నాడని ఏకంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ సంస్థలో ఆఫర్ ఇచ్చాడు. ఆ సినిమానే ‘ఎల్లమ్మ’. ఇందులో హీరోగా నితిన్ నటించాల్సి ఉంది. అయితే, దీనికి ముందు నితిన్-దిల్ రాజు కాంబోలో వచ్చిన తమ్ముడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది.
Also Read- Kantara Chapter 1: కాంతార చాప్టర్ వన్ – ఇక్కడ ఇండస్ట్రీ హిట్టు – అక్కడ డిజాస్టర్!
అంతకముందు ఉన్న ఫ్లాపుల నుంచి తమ్ముడు సినిమాతో నితిన్ బయటపడతాడని అందరూ భావించారు. దిల్ రాజు కూడా ఇదే, ఆలోచించి నితిన్-వేణు కాంబోలో ఎల్లమ్మ చేయాలనుకున్నాడు. కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి నితిన్ తప్పుకోగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట. ఇంతలో వేణు.. ఎవరూ ఊహించని విధంగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.
జనరల్‌గా ఒక సినిమా ఆగిపోతే.. మరో హీరో కోసం ట్రై చేస్తుంటారు. కానీ, వేణు…వెరైటీగా తన నెక్స్ట్ సినిమాను దేవీశ్రీప్రసాద్ తో ప్లాన్ చేయడం ఎంతో ఆసక్తికరం అని చెప్పాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుందట. త్వరలో, ఈ సినిమాను నిర్మించే నిర్మాణ సంస్థ సహా ఇతర విషయాలన్నీ అధికారికంగా వెల్లడి కానున్నాయట. మరి, వేణు-నితిన్ కాంబోలో ఎల్లమ్మ ఉంటుందా.. ? ఉంటే హీరో నితిన్ అవుతాడా.. దేవీశ్రీతో వేణు కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది.. ఆ కథ ఏంటీ..? ఈ విషయాలన్నీ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read- Ravi Teja: మాస్ మహారాజా తగ్గేదేలే – మరో సినిమాకు రవితేజ గ్రీన్‌సిగ్నల్ – డైరెక్టర్ ఎవరంటే?


