OG vs Akhanda 2: సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎంతలా పీక్స్ చేరుకున్నాయో అందరికీ తెలిసిందే. ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరోపై నెగిటివ్ ట్రోల్స్, క్యాంపెయినింగ్‌తో సోషల్ మీడియా హీటెక్కుతోంది. ముఖ్యంగా నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఈ వార్ జోరుగా నడుస్తుంటుంది. కానీ, ఈ సినారియోకు పూర్తి విరుద్ధంగా, బాలకృష్ణ తీసుకున్న ఒక డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ: Dragon: ఎన్టీఆర్–నీల్ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో నాన్‌స్టాప్ షూటింగ్!
రీసెంట్‌గా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ మధ్య ఉన్న స్ట్రాంగ్ పొలిటికల్, పర్సనల్ బాండింగ్ గురించి అందరికీ తెలుసు. అయితే, ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అంటే… దానికోసం బాలయ్య తన భారీ ప్రాజెక్ట్‌నే వాయిదా వేశారు. ఈ బిగ్ సీక్రెట్‌ను ‘అఖండ 2’ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేయడంతో, ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఆ డెసిషన్ వెనుక ఉన్న కారణం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’!
నిజానికి, ‘అఖండ 2’ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. బోయపాటి చెప్పిన ప్రకారం, ఆగస్టు 10 కల్లా రీ రికార్డింగ్ కూడా అయిపోయి, సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండింది. ఫస్ట్ ప్లాన్ ప్రకారం, సెప్టెంబర్ 25న ‘అఖండ 2’ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ దసరాకి వస్తుందని తెలియడంతో, బాలయ్య ఈ సెప్టెంబర్ డేట్‌ను ‘ఓజీ’ కి ఇచ్చేశారు.
ALSO READ: Akhanda 2: అఖండ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ – బాలకృష్ణ మాస్ ర్యాంపేజ్
బాలయ్య, బోయపాటితో మాట్లాడుతూ: “మన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు దారిద్దాం. ఇప్పుడు మనం పోటీకి దిగడం కరెక్ట్ కాదు” అని సింపుల్‌గా చెప్పారట. షూటింగ్ కంప్లీట్ అయ్యి, రిలీజ్‌కు రెడీగా ఉన్న ఒక ప్రాజెక్ట్ డేట్‌ను కేవలం తమ్ముడి సినిమా కోసం వాయిదా వేయమని కోరడం అనేది బాలయ్య గ్రేట్ గెస్చర్‌కు నిదర్శనం. అందుకే, సెప్టెంబర్ నుంచి వాయిదా పడిన ‘అఖండ 2’ ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

