Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభVeera Simha Reddy : బాల‌య్య 'వీర సింహా రెడ్డి' రిలీజ్ డేట్ ఫిక్స్‌.. అభిమానుల‌కు...

Veera Simha Reddy : బాల‌య్య ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. అభిమానుల‌కు పండ‌గే

Veera Simha Reddy : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ ఎర్నేని, యల‌మంచిలి ర‌విశంక‌ర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది.

- Advertisement -

ఇక ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. వారికి చిత్ర బృందం శుభవార్త చెప్పింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. దీంతో బాల‌య్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

రానున్న సంక్రాంతి రేసులో ముగ్గురు బ‌డా హీరోలు పోటీ ప‌డ‌నున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీర‌య్య‌’, బాల‌య్య ‘వీర సింహా రెడ్డి’, ద‌ళ‌ప‌తి విజ‌య్ ‘వార‌సుడు’ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్దం అయ్యాయి. ఈ మూడు చిత్రాల్లో ‘వీర సింహా రెడ్డి’ అఫిషీయ‌ల్ అనౌన్స్ రాగా.. మిగిలిన చిత్రాల ఏ తేదీల్లో విడుద‌ల అవుతాయో తెలియాల్సి ఉంది. ఇక్క‌డో విశేషం ఏమిటంటే.. ‘వాల్తేరు వీర‌య్య‌’, ‘వీర సింహా రెడ్డి’ రెండు చిత్రాల‌ను మైత్రీ సంస్థ‌నే నిర్మిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News