Thursday, July 17, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టును తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Balakrishna)ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ‘అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం.. ఇలా చేయడం కరెక్ట్ కాదు. మేము ఎల్లప్పుడూ అల్లు అర్జున్‌కు అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు.

- Advertisement -

అల్లు అర్జున్ అరెస్టుపై నేచురల్ స్టార్ నాని(Nani) తీవ్రంగా స్పందించారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వం అధికారులు, మీడియా చూపే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. థియేటర్ ఘటన దురదృష్టకరమని.. ఇలాంటి ఘటనల నుంచి మనం చాలా చేర్చుకోవాలని సూచించారు. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది మనందరి తప్పు.. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు అని ట్వీట్ చేశారు.

అలాగే బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్(Varun Dhawan)కూడా అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించార. ‘బేబీ జాన్‌’ (Baby John) ప్రమోషన్స్‌లో భాగంగా జైపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ మాట్లాడుతూ..ఈ ఘటన బాధాకరమని.. భద్రతాపరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చుట్టు పక్కల వారికి సూచిస్తుంటారని. ఓ వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయం అని పేర్కొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News