Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభBandla Ganesh : అల్లు అర్జున్ సక్సెస్ పై బండ్లగణేష్ వ్యాఖ్యలు..

Bandla Ganesh : అల్లు అర్జున్ సక్సెస్ పై బండ్లగణేష్ వ్యాఖ్యలు..

- Advertisement -

Bandla Ganesh : నటుడు బండ్ల గణేష్ కమెడియన్ గా, నిర్మాతగా కంటే కూడా తన స్పీచ్ లు, ఇంటర్వ్యూలతో ఇటీవల బాగా పాపులర్ అయ్యారు. తన స్పీచ్ లతో బండ్ల గణేష్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా బండ్ల గణేష్ దర్శకుడు గుణశేఖర్ కూతురి వివాహానికి వెళ్లగా అక్కడికి అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ కూడా వచ్చాడు. అల్లు బాబీని పలకరిస్తూ మీడియా ముందు మాట్లాడారు.

బండ్లగణేష్ పక్కన బాబీని పెట్టుకొని మాట్లాడుతూ.. తండ్రిమాట వినకపోతే బన్నీలాగా తయారవుతారు. తండ్రిమాట విని బాగా చదువుకుంటే ఇలా అల్లు బాబీలాగా తయారవుతారు. తండ్రి మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని బన్నీలాగా తయారవుతారా లేకా బాబీ లాగా తయారవుతారా మీ ఇష్టం అని అన్నాడు.

దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తిట్టాడా, పొగిడాడా అని అనుకుంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు పక్కనే ఉన్న బాబీ మాత్రం వీటిని సరదాగా తీసుకొని నవ్వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News