Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభBandla Ganesh Dance: పవనేశ్వరా.. పవరేశ్వరా! బండ్లన్న ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా.!

Bandla Ganesh Dance: పవనేశ్వరా.. పవరేశ్వరా! బండ్లన్న ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా.!

Paya Paya Song : నటుడు శివాజీ, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నేరుగా డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్ల విడుదల స్కిప్ చేసి నేరుగా ఓటీటీ బాట పట్టిన ఈ చిత్రం, తాజాగా విడుదలైన ఒక స్పెషల్ సాంగ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

- Advertisement -

నేరుగా ఓటీటీలోకి ‘సుద్దపూస’

దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ వినూత్న క్రైమ్ కామెడీ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్‌’ (ETV Win) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 12వ తేదీ నుండి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. చాలా కాలం తర్వాత శివాజీ, లయ వంటి సీనియర్ నటులు జంటగా కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

బండ్ల గణేశ్ ‘పాయా’ డ్యాన్స్ హంగామా

ప్రచార చిత్రాల్లో భాగంగా విడుదలైన ‘పాయా పాయా’ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ పాటలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తనదైన శైలిలో స్టెప్పులేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక కలర్‌ఫుల్ ఫుడ్ ఫెస్టివల్ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో బండ్లన్న ఎనర్జీ లెవల్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆయనతో పాటు హాస్య నటుడు అలీ, భోలే శావలి, బబ్లూ కూడా ఈ పాటలో సందడి చేశారు.

పవనేశ్వరా.. పవరేశ్వరా రిఫరెన్స్

బండ్ల గణేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఈ పాటలో కూడా ఆ అంశాన్నే ప్రధానంగా హైలైట్ చేశారు. బండ్ల గతంలో ఒక ఫంక్షన్‌లో చెప్పిన “ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా” అనే పాపులర్ డైలాగ్‌ను ఈ పాటలో మ్యూజిక్ బిట్‌గా రీమిక్స్ చేశారు.

పవన్ కల్యాణ్ సిగ్నేచర్ స్టైల్స్ , స్టెప్పులను బండ్ల గణేశ్ ఇందులో అనుకరించడం ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే కాకుండా, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశిస్తూ ఈ పాటలో సాహిత్యం ఉండటం విశేషం.

నెటిజన్ల రియాక్షన్

ఈ పాటపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. బండ్ల గణేశ్ డ్యాన్స్ చూసి కొందరు “బండ్లన్న విశ్వరూపం” అని మెచ్చుకుంటుంటే, మరికొందరు పాట బాణీ ఇంకా బాగుండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఈ ఒక్క పాటతో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రానికి భారీగా పబ్లిసిటీ లభించిందని చెప్పవచ్చు.

Jana Nayagan: దళపతి విజయ్ చివరి సినిమాకు చిక్కులు.. 20 నిమిషాల సీన్లు కట్.!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News