Friday, March 13, 2026
Homeచిత్ర ప్రభNagarjuna: బంగార్రాజు మూడో పార్ట్ రెడీ - సంక్రాంతిని టార్గెట్ చేసిన నాగార్జున‌

Nagarjuna: బంగార్రాజు మూడో పార్ట్ రెడీ – సంక్రాంతిని టార్గెట్ చేసిన నాగార్జున‌

Nagarjuna: నాగార్జున‌, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సోగ్గాడే చిన్ని నాయ‌నా, బంగార్రాజు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున సోలో హీరోగా క‌నిపించాడు. బంగార్రాజులో మాత్రం త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించాడు. సోగ్గాడే చిన్ని నాయ‌నాకు కొన‌సాగింపుగా బంగార్రాజు రూపొందింది. తాజాగా ఈ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ కూడా రానుంద‌ట‌.

- Advertisement -

బంగార్రాజు 3 క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో క‌ళ్యాణ్ కృష్ణ ఫుల్ బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే నాగార్జున‌ను క‌లిసిన డైరెక్ట‌ర్‌ మూడో పార్ట్‌కు సంబంధించిన కోర్ పాయింట్‌ను వినిపించాడ‌ట‌. ఐడియా ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌టంతో నాగార్జున ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మూడో పార్ట్ కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఫ‌న్ ఫ్యామిలీ డ్రామాగా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. బంగార్రాజు 3లో నాగార్జున మాత్ర‌మే హీరోగా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య గెస్ట్ రోల్ చేస్తాడ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం వంద‌వ‌ సినిమాతో నాగార్జున బిజీగా ఉన్నారు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ రా కార్తీక్‌తో చేస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ను మే నెల‌లోపు కంప్లీట్ చేసి బంగార్రాజు 3 సెట్స్‌పైకి తీసుకురావాల‌నే ప్లాన్‌లో నాగార్జున ఉన్న‌ట్లు స‌మాచారం. బంగార్రాజు 3ని సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకుంటున్నార‌ట‌. ప‌ర్‌ఫెక్ట్ సంక్రాంతి సినిమాలా ఉండేలా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలిసింది. స్వీయ నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై బంగార్రాజు 3ని నాగార్జున నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ALSO READ : https://teluguprabha.net/cinema-news/sreeleela-confirmed-as-female-lead-opposite-dhanush-in-d55-movie/

ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో చిరంజీవి – బాబీ మూవీతో పాటు వెంక‌టేష్ – అనిల్ రావిపూడి, బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని సినిమాలు ఉన్నాయి. తాజాగా నాగార్జున స‌నిమా కూడా పండుగ‌ను టార్గెట్‌గా పెట్టుకోవ‌డం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. బంగార్రాజు 3 కంటే ముందు చిరంజీవి కోసం ఓ క‌థ‌ను సిద్ధం చేశారు క‌ళ్యాణ్ కృష్ణ‌. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. కానీ క‌ళ్యాణ్ కృష్ణ క‌థ‌ను ప‌క్క‌న‌పెట్టి చిరంజీవి…అనిల్ రావిపూడితో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు చేశారు.

ALSO READ : https://teluguprabha.net/cinema-news/bandla-ganesh-dance-paya-paya-song-suddapoosani-ott/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News