Thursday, January 9, 2025
Homeచిత్ర ప్రభBellamkonda Sai: యాక్షన్ హల్క్ బెల్లంకొండకు ఈసారైనా హిట్ దక్కేనా?

Bellamkonda Sai: యాక్షన్ హల్క్ బెల్లంకొండకు ఈసారైనా హిట్ దక్కేనా?

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు హిట్లు లేవు, ఇంకా హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు. 10 ఏళ్లుగా స్ట్రగుల్ అవుతూ తన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని, ఇమేజ్ సంపాదించి, హీరోగా ఎలివేట్ అయ్యేలాంటి ఒక్క పెద్ద బ్లాక్ బస్టర్ కెరీర్ లో ఏదీ పడలేదు. హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో తన లక్ ట్రై చేసినా, ఎంత భారీ బడ్జెట్ పెట్టి తీసినా, క్రేజీ హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసినా బెల్లంకొండ సాయి ఫిలిం కెరీర్ మాత్రం హిట్ పట్టాలెక్కలేదు.

- Advertisement -

పాన్ ఇండియా మూవీతో

లేటెస్ట్ గా మరో పాన్ ఇండియా ఫిల్మ్ తో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. ఈసారి హైందవ అనే #BSS12 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి ట్రెండింగ్ లో ఉండేందుకు సర్వం ఒడ్డుతున్నాడు. ఓవైపు సాయి తండ్రి ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సాయి, ఆయన సోదరుడు బెల్లంకొండ సాయి గణేష్ లు మాత్రం బాగా కష్టపడుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయక తప్పటం లేదు.

దశావతార ఆలయం చుట్టూ

హైందవ హై-బడ్జెట్ మూవీ కథ శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ వుంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో వచ్చిన మేకర్స్ బ్రెత్ టేకింగ్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను లాంచ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ లో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి, మాచో అవతార్‌ అదరగొట్టే ప్రయత్నాలన్నీ గట్టిగా చేసినట్టు ఇది చూస్తుంటే క్లియర్ గా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News