యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) కారు డ్రైవ్ చేస్తూ హల్‌చల్ చేశాడు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్‌లోకి దూసుకువచ్చాడు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలబ్రెటీలు ఇలా నిబంధనలు ఉల్లంఘించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
- Advertisement -
ఇక బెల్లంకొండ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన నటించిన ‘భైరవం’ చిత్రం మే30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించడం విశేషం. అలాగే టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపూరి లాంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.