Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభKamal Haasan: కమల్ హాసన్‌కు కోర్టు వార్నింగ్..ఏం జరిగిందంటే?

Kamal Haasan: కమల్ హాసన్‌కు కోర్టు వార్నింగ్..ఏం జరిగిందంటే?

Kamal Haasan: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవలే తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలను కోర్టు సీరియస్‌గా తీసుకుంది. కన్నడ భాష లేదా కన్నడ సంస్కృతి గౌరవానికి భంగం కలిగేలా ఇక మీదట ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

- Advertisement -

కమల్ హాసన్ హీరోగా, త్రిష కథానాయికగా, ప్రముఖ హీరో శింబు ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్రాన్ని తమిళ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించారు. అయితే గత నెలలో ఈ సినిమా విడుదల కాగా.. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందమంతా బెంగళూరు వెళ్లింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కన్నడ నాట పెద్ద దుమారమే రేగింది.

కన్నడ సినీ పరిశ్రమలో కొందరితో పాటు అనేక కన్నడ భాషా సంఘాలు తప్పుబట్టాయి. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆందోళన చేశాయి. అయితే దీనిపై స్పందించిన నటుడు కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. దీంతో ఈ వివాదం ముదిరి కన్నడ రాష్ట్రమంతా ‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది.

ఈ వివాదంపై కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్ వూరాలా మాట్లాడుతూ.. కమల్ హాసన్ వ్యాఖ్యలపై బెంగళూరు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి ఎన్.ఆర్. మధు.. కన్నడ భాష, సాహిత్యం, భూమి, సంస్కృతికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నటుడు కమల్‌ హాసన్ పై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక‌ ఆగస్టు 30న జరగనున్న తదుపరి విచారణకు కథానాయకుడు క‌మ‌ల్‌ హాసన్ ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు కూడా కోర్టు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News