Homeచిత్ర ప్రభChance : లెనిన్’ హిట్ తెచ్చిన అదృష్టం.. మోహన్‌లాల్ చిత్రంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ...

Chance : లెనిన్’ హిట్ తెచ్చిన అదృష్టం.. మోహన్‌లాల్ చిత్రంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే

Bhagyashri Borse in Mohanlal movie Operation Ganga : ‘లెనిన్’ చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నట్లుగా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కెరీర్ మారిపోయింది. రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’, విజయ్ దేవరకొండతో ‘కింగ్ డమ్’. రామ్ పోతినేనితో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి సినిమాలు చేసినప్పటికీ ఆ చిత్రాలు అంతగా ఆడకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన ‘లెనిన్’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం ఆమెతో పాటు హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో అఖిల్ లో కూడా ఎనలేని ఆశలను నింపింది. వారిద్దరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కంబ్యాక్ ను ఈ చిత్రం ద్వారా అందుకున్నారు.

- Advertisement -

ఇక అఖిల్ తదుపరి చిత్రంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ భాగ్యశ్రీ మాత్రం ఓ క్రేజీ ప్రాజెక్ట్ వరించింది. మలయాళ సీనియర్ కథానాయకుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందే భారీ సినిమా ‘ఆపరేషన్ గంగ’ సినిమాలో భాగ్యశ్రీ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. మలయాళంలో ఈ చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తుండగా… ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ గోకులం సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ సినిమా రంగాలలో సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీకి మొదటిసారి మలయాళంలోకి ప్రవేశించడం, అందునా మోహన్ లాల్ లాంటి లెజెండ్ సినిమాలో నటిస్తుండటం ఆమె కెరీర్ కు మరో మలుపు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అలాగే భాగ్యశ్రీని తమ సినిమాలలోకి తీసుకోవాలని కొందరు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఒక్క హిట్ తెచ్చే సంతోషం ఎలా ఉంటుందో అన్న దానిని ఆమె ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News