బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భైరవం'(Bhairavam). తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ‘రాత్రి నాకో కల వచ్చింది’ అంటూ జయసుధ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించేందుకు ఆంజనేయుడు ఉంటే.. ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఈ శ్రీనుగాడు ఉన్నాడు’ అంటూ బెల్లంకొండ డైలాగ్ అదిరిపోయింది. ముగ్గురు హీరోలు చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని నాంది, ఉగ్రం.. లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తీసిన విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె. రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.