Tuesday, September 17, 2024
Homeచిత్ర ప్రభBhaje vayu vegam: ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా కార్తికేయ మూవీ

Bhaje vayu vegam: ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా కార్తికేయ మూవీ

31న రిలీజ్

సెన్సార్ నుంచి యు.ఎ. సర్టిఫికేట్ పొందిన కార్తికేయ గుమ్మకొండ “భజే వాయు వేగం” సినిమా. ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది మూవీ. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న “భజే వాయు వేగం” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

- Advertisement -

తాజాగా “భజే వాయు వేగం” సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యు.ఎ. సర్టిఫికేట్ జారీచేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News