Wednesday, October 30, 2024
Homeచిత్ర ప్రభBharateeyudu 2: మిస్ యూనివ‌ర్స్ డెమి-లీ టెబో భారతీయుడు 2లో..

Bharateeyudu 2: మిస్ యూనివ‌ర్స్ డెమి-లీ టెబో భారతీయుడు 2లో..

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ , రెడ్ జెయింట్ బ్యాన‌ర్స్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ నుంచి ‘క్యాలెండర్ ..’ లిరికల్ సాంగ్ రిలీజ్.. పాటలో స్పెషల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచిన ద‌క్షిణాఫ్రికా మోడ‌ల్‌, 2017లో మిస్ యూనివ‌ర్స్ విజేత డెమి-లీ టెబో

- Advertisement -

‘‘పాలపుంతల్లో వాలి- జంట మేఘాల్లో తేలి
భూమితో పని లేకుండా- గడిపేద్దామా!
వెన్నెల మాటలు కొన్ని- చుక్క‌ల ముద్దులు కొన్ని
దేవుడి న‌వ్వులు కొన్ని క‌లిపేద్దామా!..’’

అంటూ చిన్నది కొంటెగా పాడితే మగవాడు మామూలుగా ఉండ‌గ‌ల‌డా! అస‌లు త‌న అంద చందాల గురించి ఇంత అందంగా వ‌న్నెంచి చిన్న‌ది ఎవ‌రు.. ఎవ‌రితో ఆడి పాడుతుంద‌నే విష‌యాలు తెలియాలంటే ‘ఇండియన్ 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.

28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌మ‌ల్ హాసన్‌, శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగిపోతుంది. ఈ త‌రుణంలో మేక‌ర్స్ సోమ‌వారం ఈ సినిమా నుంచి ‘క్యాలెండ‌ర్’ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ప్ర‌ముఖ ద‌క్షిణాఫ్రికా మోడ‌ల్‌, 2017లో మిస్ యూనివ‌ర్స్ విజేత డెమి-లీ టెబో ఈ పాట‌లో న‌టించ‌టం. ఇక శంకర్ మేకింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన స్టైల్లో పాట‌లోని ప్ర‌తి స‌న్నివేశాన్ని గ్లామ‌ర్‌గానే కాదు.. వావ్ అనిపించేంత గొప్ప‌గా చిత్రీక‌రించారని చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఈ పాట‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూస్తే ఆ ఫీల్ మ‌రోలా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు.

యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న భార‌తీయుడు 2 చిత్రంలో క్యాలెండ‌ర్ సాంగ్ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చంద్ర‌బోస్ రాయ‌గా శ్రావ‌ణ భార్గ‌వి ఆల‌పించారు. సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారోనంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించగా, ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేశారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందించారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూలై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లో సంద‌డి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News