Homeచిత్ర ప్రభBhogi: హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ‘భోగి’.. అక్టోబర్ 4న టీజర్ రిలీజ్ 

Bhogi: హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ‘భోగి’.. అక్టోబర్ 4న టీజర్ రిలీజ్ 

Bhogi: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కథానాయకుడిగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘భోగి’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్‌‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు తెలిపారు. శర్వాసంపత్ బ్లడ్ ఫెస్ట్ అనే హ్యాష్‌‌ట్యాగ్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శర్వాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంపత్ నంది మార్క్ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ టీజర్ కోసం శర్వా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1960 నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్ లో సాగే ఇతివృత్తంతో మలుస్తున్న ఈ చిత్రంలోని గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్ ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందిస్తాయని మేకర్స్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News