Bhu Antutu Bhuutham song: యువ హీరో ఇటీవల నితిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన‘భీష్మ’ మూవీ తర్వాత నితిన్ సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో అర్జెంటుగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘ఎంసీఏ’, ‘వకీల్ సాబ్’ చిత్రాల డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ చిత్రం చేశాడు.
తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ చిత్రం తమ్ముడు పేరునే తన సినిమాకు పెట్టుకున్నాడు. ఈ పేరు పెట్టడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. అలాగే కొన్ని రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచేసింది. విజువల్స్, నితిన్ నటనకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మూవీ యూనిట్ హోప్స్ పెట్టుకుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘భూ అంటూ భూతం..’అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సింహాచలం మన్నేలా సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆలపించారు. అంజనీష్ లోకనాథ్ అద్భుతంగా సంగీతం అందించారు. తన మేనకోడలుకు ధైర్యం చెప్పే సన్నివేశంలో భాగంగా ఈ సాంగ్ తెరకెక్కించారని తెలుస్తోంది.
చాలా రోజుల తర్వాత సీనియర్ హీరోయిన్ లయ ఈ చిత్రం ద్వారా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. నితిన్ అక్క పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇక సప్తమీ గౌడ, శ్వాసికా విజయ్, సౌరభ్ సచ్‌దేవ, వర్ష బొల్లమ్మ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా జులై 4వ తేదీన మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
Tammudu: ‘భూ అంటూ భూతం..’అంటున్న నితిన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES