NTR 31: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి ‘డ్రాగన్’ (ప్రస్తుతం పరిశీలనలో ఉన్న టైటిల్). ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. సౌత్ లో మాత్రమే కాకుండా దేశంమొత్తం ఆయనకు ఉన్న బ్రాండ్.. అలాగే, ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ కి వచ్చిన స్టార్ డమ్ కలిపి ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాట తెరకెక్కించారు.
ఆ పాటకి సినిమాలో చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా సమాచారం. ఇక ఈ పాటలో తారక్ ఎమోషన్ పీక్స్‌లో ఉంటాయని త్రిపులార్ మూవీలో కొమరం భీముడో సాంగ్ కి మించి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఉన్నపలంగా ప్రశాంత్ నీల్ స్క్రిప్టులో కొన్ని కీలకమైన మార్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
పూరి జగన్నాధ్, సుకుమార్ లాంటి వారు అత్యవరం అయితే తప్ప స్క్రిప్టు లాక్ అయ్యాక మార్పులు చేర్పులు జరపరనే టాక్ ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ కూడా. కానీ ఆయన ఎన్టీఆర్ సలహాలతో స్క్రిప్టుని షూటింగ్ సమయంలోనూ కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. షెడ్యూల్ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ స్క్రిప్టు కి సంబంధించి కొంత మళ్ళీ వర్క్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్. ప్రతీ విషయాన్ని ఎన్టీఆర్ తో షేర్ చేస్తున్నారట.
కేజీఎఫ్ సిరీస్, ఆ తరవాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన ‘సలార్’ సినిమాలు బాక్సాఫీసు దగ్గరవద్ద మంచి హిట్ సాధించాయి. అయితే ప్రభాస్ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నప్పటికీ సలార్ విషయంలో కాస్త అసంతృప్తిగా అనిపించిందట. ఇంకా బాగా తీయాల్సింది అని కూడా సలార్ చూశాక చాలామంది అభిప్రాయపడ్డారు. అదే తప్పు తారక్ సినిమాకి జరగకుండా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే, షూటింగ్ మధ్యలో కూడా సీన్స్ లో మార్పులు, చేర్పులు చేస్తున్నారట. చూడాలి ప్రశాంత్ నీల్ ఏ రేంజ్‌లో తారక్‌ని ఎలివేట్ చేయబోతున్నారో..ఎలాంటి సెన్షేషనల్ హిట్ ఇవ్వబోతున్నారో.