Homeచిత్ర ప్రభDemon Pavan: బిగ్ బాస్ డిమోన్ పవన్ ఇంట విషాదం.. తండ్రి మృతి

Demon Pavan: బిగ్ బాస్ డిమోన్ పవన్ ఇంట విషాదం.. తండ్రి మృతి

Demon Pavan Father Died: బిగ్ బాస్ ఫేం డిమోన్ ఇంట విషాదం నెలకొంది. డిమోన్ పవన్ తండ్రి ఈ రోజు కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన మంగళవారం (మార్చి 10, 2026) మరణించారు. ఈ విషయాన్ని పవన్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఆయన మృతికి సంతాపం తెలుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఫ్యాన్స్, బిగ్ బాస్ సహా కంటెస్టెంట్స్ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ కష్ట సమయంలో పవన్ కి ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -

తండ్రి మృతి.. డిమోన్ ఎమోషనల్
కాగా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు డిమోన్ తన తండ్రి అనారోగ్యం గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి నోటి క్యాన్సర్ బాధపడుతున్నారని చెప్పి హౌస్‌లోనే ఎమోషనల్ అయిన సందర్భం ప్రేక్షకులను కదిలించింది. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయన తండ్రి మరణించిన వార్త కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచేసింది. తన తండ్రి మరణించిన ఈ విషాద వార్తని తెలియజేస్తూ పవన్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తన జీవితంలో ఆయన పాత్ర ఎంత ముఖ్యమైనదో వివరిస్తూ.. జీవితంలో ఆయన ఇచ్చిన విలువలు ఎప్పటికీ మరవలేనివంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు పవన్‌కు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

రీతూతో సన్నిహితం
తెలుగు బిగ్ బాస్ 9 సీజన్ లో పవన్ తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. హౌజ్ లో అందరితో సఖ్యతగా ఉంటూ ప్రేక్షకుల మనసు గెలిచాడు. గేమ్స్ వందశాతం ఎఫర్ట్స్ పెడుతూ హౌజ్ మేట్స్ గట్టి పోటీ ఇచ్చాడు. హౌజ్ లో రీతూ చౌదరితో సన్నిహితం తెలిసిందే. వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉంటూనే టామ్ అండ్ జర్రీల పొట్లాడుకుంటూ ఆడియన్స్ ని మెప్పించారు. వీరిద్దరి జోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. బయటకు వచ్చాక కూడా రీతూ, పవన్ ఇద్దరు తమ స్నేహన్ని కొనసాగిస్తున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే పవన్-రితూలు జంటగా బీబీ జోడి డ్యాన్స్ షోలో పాల్గొని తమ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. ఇటీవల ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన పవన్ అంతలో ఈ విషాద వార్తను చెప్పడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News