Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభBigg Boss 9 Promo: ఈసారి రణరంగమే.. అదిరిపోయిన బిగ్ బాస్ ప్రోమో

Bigg Boss 9 Promo: ఈసారి రణరంగమే.. అదిరిపోయిన బిగ్ బాస్ ప్రోమో

Bigg Boss 9 Promo released: తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న వారు ఎందరో సెలబ్రెటీలుగా మారిపోయారు. దీంతో ఈ షోలో పాల్గొన్నాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. ఇప్పటివరకు 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. 9వ సీజన్ కి రెడీ అయింది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సీజన్ కు సంబంధించి రిలీజైన ప్రోమో ఆకట్టుకుంది. ఈ సీజన్ హోస్ట్ గా నాగార్జున్ ఉండరని ప్రచారం జరిగింది. అయితే నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారంటూ ఈ ప్రోమో ద్వారా రూమర్లకు చెక్ పెట్టారు నిర్వాహకులు.

ఈ ప్రోమోలో నాగార్జున స్టైలిష్ లుక్ లో కనిపించారు. గద పట్టుకొని సూటులో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు.. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలని నాగ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ ఈ సీజన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. దీంతో ఈ సీజన్ పై అప్పుడే హైప్ పెరిగింది. ప్రోమో అదిరిపోయిందని.. సీజన్ కోసం వెయిటింగ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కంటెస్టెంట్లు ఎవరనే దానిపై చర్చించుకుంటున్నారు.

కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. కిర్రాక్‌ బాయ్స్‌ కిలాడీ గర్ల్స్‌ సీజన్‌ 2లో ఉన్న వారిలో ఎక్కువ మంది ఈ షోలో భాగం కానున్నారని సమాచారం. అలాగే బుల్లితెర సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ స్టార్లు కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పేర్లు తెరమీదకి వస్తున్నాయి. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్‌ తొలి వారంలో బిగ్‌బాస్‌ 9 ప్రసారం కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News