Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభNeha Chowdary : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్.. అదే రోజు ఫైనల్ ఎపిసోడ్ కి...

Neha Chowdary : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్.. అదే రోజు ఫైనల్ ఎపిసోడ్ కి హాజరు..

- Advertisement -

Neha Chowdary : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్.. అదే రోజు ఫైనల్ ఎపిసోడ్ కి హాజరు..తెలుగు బిగ్‌బాస్ లో ఈ సారి పాల్గొన్న కంటెస్టెంట్స్ లో నేహా చౌదరి ఒకరు. యాంకర్ గా, స్పోర్ట్స్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం నేహా. కానీ యాంకర్ కంటే ముందే జిమ్నాస్టిక్స్ లో నేషనల్ ఛాంపియన్ నేహా చౌదరి. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ సీజన్ లో బిగ్‌బాస్ లో పాల్గొని తొందరగానే బయటకి వచ్చేసింది నేహా చౌదరి. బిగ్‌బాస్ లో ఉన్నప్పుడే హౌజ్ నుంచి బయటకి వెళ్ళగానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. చెప్పినట్టే హౌజ్ నుంచి బయటకి రాగానే తన పెళ్లి గురించి ప్రకటించింది నేహా చౌదరి. తన కాలేజీ మెట్ అనిల్ ని పెళ్లి చేసుకోబోతున్నాను అని తెలిపింది.

నేహా చౌదరి వివాహం డిసెంబర్ 17న రాత్రిపూట హైదరాబాద్ లోనే సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగింది. అయితే బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా హాజరవ్వాల్సిందే. దీంతో బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ షూట్ కూడా అదే రోజు జరగడంతో షూటింగ్ కాసేపు హాజరయి తర్వాత పెళ్లి మండపానికి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కూడా షూట్ అయ్యాక నేహా చోదరి వివాహానికి వచ్చి కొత్త దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నేహా చౌదరి పెళ్ళిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా ఉన్న ఫోటో వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News