OTT Movies And Web Series: ఈ వారం ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సిరీస్‌లు, సినిమాలు ఏవంటే?
బైసన్
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన తమిళ మూవీ బైసన్ నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. కబడ్టీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. బైసన్‌తో కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు ధృవ్ విక్రమ్. థియేటర్లలో యాభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది ఈ మూవీ.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
ఫ్యామిలీ మ్యాస్ సీజన్ వన్‌తో పాటు సీజన్ 2 ఓటీటీ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ స్పై యాక్షన్ సిరీస్‌కు మూడో సీజన్ కూడా రాబోతుంది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్‌సిరీస్‌ను చూడొచ్చు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
హౌమ్‌బౌండ్…
ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియల్ ఎంట్రీగా నిలిచిన హౌమ్‌బౌండ్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా మాత్రం ఈ మూవీ నిలవలేదు.
Also Read – Raj Tarun Tortoise Movie: ‘టార్టాయిస్’గా రాజ్ తరుణ్.. థ్రిలర్ సబ్జెక్ట్‌తో రానున్న హీరో
నాడు సెంటర్
బాస్కెట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో ఫస్ట్ టైమ్ తమిళంలో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. నాడు సెంటర్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో శశికుమార్, కలైయరాసన్, ఆశా శరత్, రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 20 నుంచి ఈ వెబ్‌సిరీస్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
బెంగాల్ ఫైల్స్…
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ది బెంగాల్ ఫైల్స్ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నవంబర్ 21 నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి రాబోతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
ఈగో…
కథాసుధలో భాగంగా ఈ వారం మరో మినీ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఝాన్సీ, చరణ్ పేరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మినీ మూవీకి యోహిత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. డైనింగ్ విత్ ది కపూర్స్‌తో (నెట్‌ఫ్లిక్స్) మరో రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ జిద్ధీ ఇష్క్ ఈ వారమే ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.
Also Read – Rasha Thadani: ఘట్టమనేని వారసుడికి జోడీ కుదిరింది.. రంగంలోకి బాలీవుడ్ స్టార్ డాటర్

