Bobby Deol Role in HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై అగ్ర నిర్మాతలు ఏఎం రత్నం, ఏ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్ 1 త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో వీరమల్లు చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన వీరమల్లు సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ కీలక పాత్రను పోషించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన లుక్ రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పాత్రకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను దర్శకులలో ఒకరైన జ్యోతి కృష్ణ వెల్లడించారు.
వీరమల్లు సినిమాకి సంబంధించి బాబీ డియోల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాక సందీప్ రెడ్డి వంగ రూపొందించిన యానిమల్ మూవీలో డియోల్ యాక్టింగ్‌ను జ్యోతి కృష్ణ చూశారట. అది విపరీతంగా నచ్చి వీరమల్లులోని బాబీ డియోల్ పాత్రలో చాలా మార్పులు చేసి మళ్ళీ సీన్స్ రాసినట్టు తెలిపారు. యానిమల్ సినిమాలో డియోల్ కి పెద్దగా డైలాగ్స్ లేకపోయినప్పటికీ కేవలం పర్ఫార్మెన్స్‌తోనే ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చారు.
అందుకే, హరి హర వీరమల్లులో బాబీ డియోల్ పోషించిన ఔరంగ జేబ్ పాత్రలో కీలక మార్పులు చేసి ఇంకా బలంగా తీర్చిదిద్దినట్టుగా తెలిపారు. సినిమాలో ఆయన పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతాయని ఎంతో నమ్మకంగా జ్యోతికృష్ణ అన్నారు. గత కొంతకాలంగా సినిమాలకి దూరమైన బాబీ డియోల్ యానిమల్ మూవీతో ఎవరూ ఊహించనంతగా బౌన్స్ బ్యాక్ ఆయ్యారు. ఇక వీరమల్లు సినిమాతో ఆ రేంజ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.